Women Commission : మహిళా కమిషన్ మరోసారి జ్యోతిష్యుడు వేణు స్వామికి నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీన కమిషన్ ముందు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది. మొదటి నోటీసుకు హాజరవ్వకుండా వేణు స్వామి కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. అయితే, తాజాగా గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడంతో మహిళా కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14 వ తేదీన కమిషన్ ముందు హజరవ్వాలని అందులో కోరింది.
కాగా, ఎప్పుడు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాల్లో ఉండే జ్యోతిష్యుడు వేణుస్వామి ఇటీవల అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వారి జాతకాలను విశ్లేషిస్తూ.. ఈ జంట ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు, రెండు మూడు సంవత్సరాలలోనే విడిపోతారని.. అది కూడా ఒక అమ్మాయి వళ్ల అంటూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలోతెగ వైరల్ అయి తీవ్ర విమర్శలకు దారి తీసింది.
దీంతో ఆయన చెప్పిన జ్యోషంపై అక్కినేని అభిమానులతో పాటు, మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. గతంలో మహిళ జర్నలిస్టులు సైతం ఊమెన్ కమిషన్ కు వేణు స్వామిపై ఫిర్యాదు చేశారు. దీంతో కమిషన్ ముందు హజరు కావాలని శ్రీమతి నీరెళ్ల శారద వేణు స్వామికి తొలుత ఓ నోటీసు పంపగా దానికి ఎదుట హజరవ్వకుండా వేణు స్వామి కోర్టును ఆశ్రయించడంతో అప్పుడు అతనికి రిలీఫ్ లభించింది. ఈ క్రమంలో ఇటీవల ఆ స్టేను కోర్టు ఎత్తివేయడంతో మహిళా కమిషన్ మరోసారి వేణు స్వామికి నోటీసులు జారీ చేసి ఈ నెల 14 వ తేదీన కమిషన్ ముందు హజరవ్వాలని ఆదేశించింది.