Who Is Sitting Near Rahul Gandhi: రాహుల్ పక్కన ఉంది ఆమె కాదట…మరి ఎవరంటే…?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...ఆయన పక్కన ఓ మహిళ కనిపించడం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Published By: HashtagU Telugu Desk
rahul gandhi

rahul gandhi

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ…ఆయన పక్కన ఓ మహిళ కనిపించడం తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే రాహుల్ పక్కన ఉన్న మహిళ ఎవరన్న విషయంపైన్నే చర్చ సాగింది. ఆమె నేపాల్లోని చైనా రాయబారి హౌ యాంకీ అంటూ వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజసాయిరెడ్డితోపాటు పలువురు నేతలు పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు. విజయసాయిరెడ్డి మరో అడుగుముందుకేసి..చైనా హనీ ట్రాప్ అనే పదాన్ని వాడారు.

ఈ అంశానికి సంబంధించి ఓ జాతీయ మీడియా సంస్థ అసలు నిజాన్ని బయటపెట్టింది. ఆమె చైనా రాయబారి కాదని తేల్చేసింది. ఆయన పక్కనున్న మహిళ సీఎన్ఎన్ మాజీ జర్నలిస్టు సుమ్నియా ఉదాస్ స్నేహితురాలని …నేపాల్ జాతీయురాలని సదరు మీడియా ప్రకటించింది. ఈ విషయాన్ని నైట్ క్లబ్ యజమాని వెల్లడించినట్లు పేర్కొంది. క్లబ్ కు రాహుల్ తో పాటు మరో ఐదుగురు స్నేహితులు కూడా వచ్చారని..వీరిలో ఏ ఒక్కరూ చైనీయులు కాదని స్పష్టం చేసినట్లు తెలిపింది. దాదాపు గంటన్నర పాటు రాహుల్ నైట్ క్లబ్ లో ఉన్నట్లు పేర్కొంది.

సుమ్నియా మ్యారేజ్ కు అటెండ్ అయ్యేందుకు రాహుల్ నేపాల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. విందును నైట్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రాహుల్ అక్కడున్న సందర్భంలో తీసిన వీడియో తీవ్ర దుమారాన్ని రేపింది. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో రాహుల్ నైట్ క్లబ్ లోఉన్నారంటూ బీజేపీ వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. స్నేహితురాలి పెళ్లికి వెళ్లడం నేరమా అని ప్రశ్నించింది.

  Last Updated: 04 May 2022, 07:07 PM IST