Site icon HashtagU Telugu

ప్రాణం పోతున్నా సెల్ఫీలే ముఖ్యం.. మ‌హిళ వీడియో వైర‌ల్‌

Car Selfie

Car Selfie

సెల్ఫీల పిచ్చి ప‌ట్టిందంటే చుట్టూ ఏం జ‌రుగుతుందో అర్ధం కాదు. సోష‌ల్ మీడియా అడిక్ష‌న్ అంటే అలాంటిది మ‌రి! సెల్ఫీలు తీసుకుంటూ ఎంతోమంది ప్ర‌మాదాల‌కు గురైన సంఘ‌ట‌న‌లూ చూశాం. ఆ క్ష‌ణాన్ని కెమెరాల్లో కాప్చ‌ర్ చేయాల‌ని,దాన్ని ప‌దిమందితో షేర్ చేసుకోవాల‌నే ఆతృతే ఇందుకు కార‌ణం. అలాంటి సంఘ‌ట‌నే ఒక‌టి కెనడాలో జ‌రిగింది.

అస‌లే చ‌లికాలం కావ‌డంతో కెన‌డాలో న‌దుల‌న్నీ గడ్డ‌క‌ట్టుకుపోయాయి. కెన‌డాఓని మానోటిక్ ఏరియాలో అటుగా వెళ్తున్న ఓ మ‌హిళ కారు స్కిడ్ అవ‌డంతో అలాంటి ఓ న‌దిలో ప‌డిపోయింది. అయితే, త‌న‌ను తాను కాపాడుకోవాల్సింది పోయి ఆ మ‌హిళ కారు ఎక్కి ప్ర‌మాదం ఎలా జ‌రిగిందో చూపిస్తూ సెల్ఫీలు దిగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌ర్చింది.

చుట్టుప‌క్క‌ల‌వాళ్లు ఆమెను కాపాడ‌టానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆమె మాత్రం సెల్ఫీలే ముఖ్య‌మ‌న్న‌ట్టు ప్ర‌వ‌ర్తించింది. ఓ వైపు వాహ‌నం మునిగిపోతున్నా కూడా ఆమెకు ఏమాత్రం ప‌ట్ట‌లేదు. ఈ ఘ‌ట‌న మొత్తాన్ని అక్క‌డున్న‌వాళ్లు వీడియో తీయండంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది,

 

చాలాపేప‌టి త‌ర్వాత అస‌లు లోకంలోకి వ‌చ్చిన ఆమెను క‌యాక్ వేసుకుని అక్క‌డ‌కు వెళ్లిన స్ధానికులు ర‌క్షించారు. అమెకు ఎలాంటి గాయాలు కాలేదు.ఆమెపై అతివేగంగా కారు న‌డిపినందుకు కేసుపెట్టారు పోలీసులు.