Site icon HashtagU Telugu

Bangladeshi Lover: ఫేస్ బుక్ లవర్ కోసం.. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు ఈదుకుంటూ వచ్చిన యువతి!!

bangaldesh woman

bangaldesh woman

ప్రేమ గుడ్డిది అంటారు. ఔను.. ఆ అమ్మాయిని ఫేస్ బుక్ ప్రేమ గుడ్డిదిగా మార్చింది. చిరుత పులుల అడ్డాగా ఉండే చిన్నపాటి నదినే ఈదేలా తెగింపును ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ కు చెందిన 22 ఏళ్ల కృష్ణ మండల్ అనే యువతి ఈ దుస్సాహసం చేసింది.
ఫేస్ బుక్ ద్వారా తనకు పరిచయమైన భారతీయుడు అభిక్ మండల్ ను కలిసేందుకు ఇలా చేసింది. బంగ్లాదేశ్ బార్డర్ లోని ఇండియా విలేజ్ లో నివసించే తన లవర్ ను చేరుకునేందుకు ఆమె ప్రాణాలకు తెగించింది.

చిరుత పులులు, చల్లటి నదీ ప్రవాహం, చిట్టడవి మధ్య నుంచి దాదాపు గంటపాటు ఈదుకుంటూ ఇండియాలోకి వచ్చింది. తన లవర్ అభిక్ మండల్ ఇంటికి వెళ్లింది. అతడితో కలిసి వెళ్లి కోల్ కతా లోని కాళీఘాట్ ఆలయంలో పెళ్లి చేసుకుంది. అయితే పాస్ పోర్టు లేకుండా బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి వచ్చిందనే అభియోగలతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో ఈమెను ఇండియా లోని బంగ్లాదేశ్ హై కమిషన్ కార్యాలయానికి అప్పగించనున్నారు.

Exit mobile version