Site icon HashtagU Telugu

Woman Slaps MLA: ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన మహిళ, వీడియో వైరల్

Viral

Viral

వరదలతో అల్లాడుతున్న ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలోని కైతాల్ జిల్లాలోని గుహ్లా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్‌ను చెప్పుతో కొట్టింది. వరద బీభత్సానికి గురైన ప్రాంతాల్లో సింగ్ పర్యటన సందర్భంలో మహిళల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఈశ్వర్ సింగ్ రాకతో ఆ ప్రాంతం సందడిగా మారింది. జనసమూహంలో భారీగా ఉంది. దీంతో బాధిత మహిళ నీటి ఎద్దడికి కారణమైన డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో విసుగు చెందానని మండిపడుతూ ఎమ్మెల్యేపై దాడికి దిగింది. ఇక ఎమ్మెల్యే పర్యటన ఆలస్యం కావడం పట్ల కూడా స్థానికులు నిరసనను వ్యక్తం చేశారు. ఓ మహిళ ఎమ్మెల్యేను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మీరు ఇప్పుడు వస్తారా అంటూ మండిపడటం వీడియోలో చూడొచ్చు. ఈశ్వర్ సింగ్ వ్యక్తిగత భద్రతా అధికారులు జోక్యం చేసుకుని వాగ్వాదం నుంచి బయట పడేలా చేశారు. ఈశ్వర్ సింగ్ ఆ మహిళ పట్ల తన క్షమాపణను వ్యక్తం చేశాడు. ఆమెపై ఎటువంటి చట్టపరమైన చర్య తీసుకోనని పేర్కొన్నాడు. “నేను ఆ మహిళపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోను. ఆమెను క్షమించాను.” అంటూ రియాక్ట్ అయ్యాడు.

Also Read: BC Bandhu: బీసీ బంధు పంపిణీకి సర్వంసిద్ధం, త్వరలో కుల వృత్తులకు లక్ష సాయం