ఉక్రెయిన్ లో రష్యా సైనికుల అరాచకాలు మాటల్లో చెప్పలేం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రపంచ దేశాలు యుద్ధం వద్దంటూ వారిస్తున్నా..రష్యా మాత్రం పెడచెవిన పెడుతోంది. రష్యా తీరుకు నిరసనగా కేన్స్ లో ఊహించని ఘటన జరిగింది. రెడ్ కార్పెట్ మీద సినీనటులు, హీరోయిన్లు, ప్రముఖుల సందడితో ఎంతో ఆహ్లాదంగా సాగుతున్న సినీపండుగ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఉక్రెయిన్ కు చెందిన ఓ మహిళ రెడ్ కార్పెట్ పైకి వచ్చింది. తన ఒంటిమీదున్న దుస్తులను విప్పేసి….మాపై అత్యాచారాలు ఆపండి అంటూ ఆమె ఒంటిపై రాసుకొచ్చింది. ఉక్రెయిన్ జాతీయ పతాకాన్ని ఆమె తన ఒంటిపై వేసుకుంది. అంతేకాదు…ఆమె తమపై అత్యాచారాలు అపాలని నినదిస్తూ తన గళాన్నీ గట్టిగా వినిపించింది.
వెంటనే స్పందించిన అక్కడి సెక్యూరిటీ ఆమెను బయటకు తీసుకెళ్లారు. ఒంటిమీద వస్త్రాలు వేసారు. దీనిపై కేన్స్ అధికారిక బ్రుందం ఇంకా ఎలాంటి స్పందనా తెలుపలేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉక్రెయిన్ కు సంఘీభావంగా ఆ దేశానికి చెందిన సినిమాలను ప్రదర్శిస్తున్నారు.