యూపీకి చెందిన ఓ మహిళ భారత్-చైనా సరిహద్దుల్లో అక్రమంగా నివసిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె పేరు హర్మీందర్ కౌర్. తాను పార్వతీదేవినని…కైలాస పర్వతంపై కొలువున్న శివుడ్ని పెళ్లాడబోతున్నట్లు ఆమె చెబుతోంది. ఉత్తరఖాండ్లోని నభిదాంగ్ ప్రాంతంలో నిషిద్ధ ప్రదేశంలో హర్మీందర్ కౌర్ ఉంటున్న విషయాన్ని పితోరాగఢ్ పోలీసులు గుర్తించారు. ఆమెను అక్కడినుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే…తనను బలవంతంగా తీసుకెళ్తే సూసైడ్ చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో వెనుదిరిగిన పోలీసులు మరోసారి పెద్ద బ్రుందంతో వెళ్లాలని నిర్ణయించారు.
పితోరాగఢ్ జిల్లా ఎస్పీ లోకేంద్ర సింగ్ మాట్లాడారు. ఆమె యూపీలోని అలీగంజ్ ప్రాంతానికి చెందిన మహిళ అని వెల్లడించారు. హిమాలయాల్లోని గుంజీ ప్రాంతానికి 15 రోజుల క్రితం తన తల్లితో వచ్చిందని…అందుకు ఆమెకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే ఆమె నిషేదిత ప్రాంతంలోకి అడుగుపెట్టినట్లు , అనుమతించిన మేర గతనెల 25తో కాలపరిమితి పూర్తయినట్లు వివరించారు. దీంతో ఆమెను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
