Woman Killed Mother In Law : మూకుడుతో కొట్టి అత్తగారిని మర్డర్ చేసిన కోడలు

దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. 48 ఏళ్ల మహిళ తన అత్తగారిని మూకుడు (ఫ్రయ్యింగ్ ప్యాన్) తో కొట్టి చంపింది. కీళ్లనొప్పులతో బాధపడుతున్న 86 ఏళ్ల తన అత్తను (Woman Killed Mother In Law) చూసుకోవడంలో ఆమె విసుగుచెంది ఉంటుందని పోలీసులు అంటున్నారు.

  • Written By:
  • Updated On - May 10, 2023 / 08:09 PM IST

దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. 48 ఏళ్ల మహిళ తన అత్తగారిని మూకుడు (ఫ్రయ్యింగ్ ప్యాన్) తో కొట్టి చంపింది. కీళ్లనొప్పులతో బాధపడుతున్న 86 ఏళ్ల తన అత్తను (Woman Killed Mother In Law) చూసుకోవడంలో ఆమె విసుగుచెంది ఉంటుందని పోలీసులు అంటున్నారు. ఏప్రిల్ 28న ఓ వ్యక్తి తన స్నేహితుడి తల్లి హాసీ సోమ్ కు రక్తస్రావం అవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అత్తపై కోడలు దాడి (Woman Killed Mother In Law) చేసిన విషయం వెలుగుచూసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు.. హాసి సోమ్ ముఖం, పుర్రెపై అనేక గాయాలతో వంటగదిలో పడి ఉంది. ఇంటి బెడ్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా ఉన్న అందులో స్టోరేజీ పరికరం లేదు. అయినప్పటికీ, దానిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఏప్రిల్ 29న ఎయిమ్స్ మార్చురీకి తరలించి శవపరీక్ష నిర్వహించారు. సాధారణంగా పడిపోవడం వల్ల ఇలాంటి గాయాలు కావని, శరీరం మొత్తం 14 గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ తెలిపారు. సమగ్ర విచారణ జరుపుతామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) చందన్ చౌదరి వెల్లడించారు. ఘటన జరిగిన రోజు ఫ్లాట్‌లో శర్మిష్ట మాత్రమే ఉందన్నారు.

ALSO READ : Tihar Jail Murder: పోలీసుల సమక్షంలోనే టిల్లూ హత్య: వైరల్ వీడియో

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్..

వివరాల్లోకి వెళితే .. సుర్జిత్ సోమ్ (51), అతని భార్య శర్మిష్ట సోమ్ (48) కోల్‌కతాకు చెందినవారు. 2014 నుంచి వీరు నెబ్ సరాయ్‌లోని స్వస్తిక్ రెసిడెన్సీలో నివసిస్తున్నారు. 2022 మార్చి వరకు సుర్జిత్ సోమ్ తల్లి హాసీ సోమ్ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఒంటరిగా నివసించేది. వయసు మీద పడటంతో తన తల్లి హాసీ సోమ్ ను కోల్ కతా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చాడు. సుర్జిత్ పోలీసులతో మాట్లాడుతూ .. వర్చువల్ గా తల్లి దినచర్యను పర్యవేక్షిస్తున్నందున తన ఫోన్‌లోని కెమెరా నుంచి లైవ్ ఫీడ్ ఉందని చెప్పాడు. పోలీసులను పిలిపించే ముందు బాధితురాలి బెడ్‌రూమ్‌లో ఉంచిన సీసీటీవీ కెమెరా మెమరీ కార్డ్‌ను బయటకు తీసినట్లు పోలీసుల ఎదుట సుర్జిత్ ఒప్పుకున్నాడు. తన తల్లి అంత్యక్రియల తర్వాత మెమరీ కార్డ్‌ని తన వద్ద ఉంచుకుని ఫుటేజీని చూడగా .. ఏప్రిల్ 28న ఉదయం 10:30 గంటల ప్రాంతంలో తన తల్లిపై మూకుడు (ఫ్రయ్యింగ్ ప్యాన్) తో భార్య దాడి చేయడాన్ని గుర్తించినట్లు వెల్లడించాడు. తన తల్లి చాలా కాలంగా ఆర్థరైటిస్‌తో బాధపడుతోందని, నడవడానికి ఇబ్బందిపడేదని సుర్జిత్ పేర్కొన్నాడు. తన తల్లి, అమ్మమ్మల మధ్య సత్సంబంధాలు లేవని సుర్జిత్ కూతురు చెప్పింది. సుర్జిత్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. విచారణలోని కంటెంట్, సుర్జీత్ వాంగ్మూలం, సీసీటీవీ ఫుటేజీ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి శర్మిష్టను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.