23jobs@23:యువతి అరుదైన రికార్డు..23 ఏళ్ళకే 23 ఉద్యోగాలు?

సాధారణంగా యువతీ యువకులు ఉద్యోగాల కోసం కంపెనీలు చుట్టూ కాళ్లు అరిగిపోయే విధంగా తిరుగుతూ ఉంటారు.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 08:12 PM IST

సాధారణంగా యువతీ యువకులు ఉద్యోగాల కోసం కంపెనీలు చుట్టూ కాళ్లు అరిగిపోయే విధంగా తిరుగుతూ ఉంటారు. ఉద్యోగం చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలకు వెళ్ళి అక్కడ రిజెక్ట్ చేసిన మళ్లీ ఇంకొక ఇంటర్వ్యూ కి వెళుతూ ఇలా ఉద్యోగం కోసం శతవిధాల ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి వారి అదృష్టం అలాగే చదువుకు తగ్గట్టుగా జాబులు వెతుక్కుంటూ మరి వస్తూ ఉంటాయి. కొంత మంది చదువుకున్న యువతీ యువకులు 26, 27 ఏళ్లు అయినా కూడా ఎటువంటి ఉద్యోగాలు లేకుండా ఇంటి దగ్గరే ఖాళీగా బాధపడుతూ ఉంటారు.

కానీ ఒక యువతి మాత్రం 23 ఏళ్లకే ఏకంగా ఇరవై మూడు ఉద్యోగాలు చేసింది. వినడానికి ఆశ్చర్యంగా నమ్మశక్యంగా లేక పోయినప్పటికీ ఇది మాత్రం నిజం. పదహారేళ్ళ లోనే ఉద్యోగంలో జాయిన్ అయినా ఆమె ఏడేళ్లలో దాదాపుగా 23 ఉద్యోగాలు మారింది. అంతే కాకుండా ప్రపంచంలోనే అతి పొడవైన ధైర్యం ఉన్న యువతి ఈమె అయ్యి ఉండవచ్చు. అయితే ఆ యువతి ఎన్నో ఉద్యోగాలు చేసి చివరకు స్వంతంగా వ్యాపారం ప్రారంభించింది. లండన్‌కు చెందిన అనస్తీసియా సెచెట్టో అనే ఒక యువతి ఏస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను స్థాపించి, 23 ఏళ్లు నిండకముందే సీఈవో అయిపోయింది.

16 ఏళ్ల వయసులో అనస్తీసియా బేకర్‌గా ఉద్యోగం ప్రారంభించింది. ఆమె తొలి ఉద్యోగం ఆమెకు చాలా కష్టంగా అనిపించిందని చాలా గంటలు ఫ్రీజర్‌లో నిలబడవలసి వచ్చేదని ఆమె తెలిపింది. ఆ తర్వాత ఆమె డిష్ వాషర్‌గా, వెయిట్రస్, సేల్స్ వర్కర్, పియానో ​​టీచర్, మార్కెట్ సెల్లర్, ఐస్ క్రీం సెల్లర్, రిటైల్ వర్కర్‌, బేబీ సిట్టర్‌గా ఇలా రకరకాల ఉద్యోగాలనుచేసిందట. అంతేకాకుండా సృజనాత్మక రంగాలైన నటన, మోడలింగ్, కంటెంట్ రైటింగ్, ఫొటోగ్రఫీలో కూడా అనుభవం సంపాదించింది. ప్రస్తుతం 23 ఏళ్ల వయసులో స్వయంగా ఓ కంపెనీ స్థాపించి సీఈవో అయిపోయింది.