Site icon HashtagU Telugu

She Man: పెళ్ళైన తొమ్మిది నెలలకు భర్త గురించి అసలు విషయం తెలుసుకున్న భార్య.. చివరికి!

Wedding Couple Holding Hands (1)

Wedding Couple Holding Hands (1)

కొన్ని కొన్ని సార్లు కొన్ని ఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. నిజానికి ఆ విచిత్రమైన ఘటనలు మతి ఉండి చేస్తారో.. లేదో తెలియదు కానీ.. మొత్తానికి వ్యక్తిగత జీవితంలోని విచిత్రమైన ఘటనలు జరుగుతాయి. ఇంతకీ అసలు చెప్పే విషయం ఏంటంటే.. ఒకచోట ఒక అమ్మాయి అబ్బాయి అని పెళ్లి చేసుకుంది. కాని చివరకు తాను అమ్మాయి అని తెలియటంతో మోసపోయింది.

ఇండోనేషియాలో 22 ఏళ్ల ఓ యువతి గత ఏడాది డేటింగ్ యాప్ ద్వారా తాను పెళ్లి చేసుకున్న వ్యక్తిని పరిచయం చేసుకుంది. ఇక ఆ వ్యక్తి తాను అమెరికాలో శిక్షణ పొందిన వైద్యుడుని అని.. కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి అని చెప్పటంతో ఆ యువతి ఆ వ్యక్తిని నమ్మింది. దీంతో ఇద్దరు కొంతకాలం ప్రేమలో మునగగా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

ఆ తరువాత దక్షిణ సుమత్రా ప్రాంతంలో కాపురం పెట్టగా.. తర్వాత ఆ వ్యక్తి తరచుగా కట్నం కోసం వేదించడం మొదలు పెట్టారు. అలా పది నెలల తర్వాత తన భర్త పురుషుడు కాదని తెలియడంతో ఆమె చాలా దిగ్భ్రాంతి కి గురయింది. దాంతో కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పటంతో వారి సలహాతో జాంబి జిల్లా కోర్టులో ఫిర్యాదు చేసింది. ఇక ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version