ATM Withdrawals: ఏటీఎంను విపరీతంగా వాడేస్తున్న కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్?

ప్రస్తుతం డబ్బు కావాలి అనుకున్న ప్రతిసారి ఏటీఎం కార్డు ద్వారా మనకు ఎంత కావాలి అంటే అంత డ్రా చేసుకుంటూ

  • Written By:
  • Publish Date - August 22, 2022 / 07:20 AM IST

ప్రస్తుతం డబ్బు కావాలి అనుకున్న ప్రతిసారి ఏటీఎం కార్డు ద్వారా మనకు ఎంత కావాలి అంటే అంత డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామంది నెలలో కనీసం 20 నుంచి 30 సార్లు అయినా కూడా ఏటీఎం ద్వారా డబ్బుని తీసుకుంటూ ఉంటారు. అయితే నగదు డ్రా చేయడంపై చార్జీలను పెంచేందుకు బ్యాంకులకు ఆర్బిఐ అనుమతినిచ్చింది. ఈ క్రమంలోని ఒక బ్యాంకు ఏటీఎంలో ఒక నెలలో 5 సార్లు జరిగే లావాదేవీలు ఉచితంగా, ఐదుసార్లు కంటే ఎక్కువసార్లు లావాదేలు జరిగితే ప్రతి ఒక్క లావాదేవీకి 21 రూపాయలు వసూలు చేయనున్నారు. ఇతర బ్యాంకు ఏటీఎంలను ఉపయోగిస్తే ఒక నెలలో మూడు లావాదేవీలు ఉచితం ఆ తరువాత జరిగే లావా దేవికి 21 రూపాయలు ఛార్జ్ చేయనున్నారు. అయితే గతంలో ఒక్కొక్క లావా దేవికి 15 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తుండగా ఇప్పుడు ఆ లిమిట్ ని 21కి పెంచారు.

అంటే ఇకపై ఏటీఎం నుంచి పదేపదే డబ్బు చేసే వారికి చార్జీలు కూడా భారీగానే ఉంటాయి మరి. అయితే సాధారణంగా మీరు ఒక బ్యాంకు ఎటిఎం కార్డును మరొక బ్యాంకు ఎటిఎం లో ఉపయోగించినప్పుడు,జరిగే ప్రతి లావాదేవీపై ఆ బ్యాంక్‌కి ఫీజును చెల్లించాలి. ఇంటర్ చేంజ్ ఫీజును మరియు చివరికి బ్యాంకులు కస్టమర్ల నుండి వసూలు చేస్తాయి. కాబట్టి ఇకపై ఏటీఎం ను అతిగా ఉపయోగించేవారు, అలాగే ఏదైనా ఇతర బ్యాంకు ఎటిఎం ని ఉపయోగించినప్పుడు, అది ఉచితం కాదని అన్న విషయాన్ని తెలుసుకోండి. అయితే ఏటీఎం సర్వీస్ ఛార్జీలను పెంచడానికి గల కారణం ఏటీఎం నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఈ బ్యాంకులు ఏటీఎం సర్వీస్ చార్జీలను పెంచుతున్నాయి.

అయితే సొంత బ్యాంకు నుండి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల నుండి కేవలం 3 లావాదేవీలకు మాత్రమే అనుమతిస్తారు. రూ.25,000 నుండి రూ.50,000 మధ్య లావాదేవీలకు, సొంత బ్యాంకు నుండి 5 లావాదేవీలు, ఇతర బ్యాంకుల నుండి 3 లావాదేవీలకు అనుమతిస్తారు. అయితే 50,000 కంటే ఎక్కువ లావాదేవీల కోసం మీరు ఇతర బ్యాంకుల నుండి 3 సార్లు విత్ డ్రా చేసుకోవచ్చు. అదే మీ స్వంత బ్యాంకు నుంచి అయితే అపరిమితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఇకపై ఏటీఎంను అతిగా ఉపయోగించేవారు ఐదు లావాదేవీల కంటే ఎక్కువగా జరిగితే ప్రతి ఒక్క లావాదేవీ పై 21 రూపాయలు చార్జ్ చేస్తారు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.