Wipro Jobs Cut: ఫ్రెషర్స్ కు ‘విప్రో’ షాక్.. 400 మంది ఉద్యోగులు ఔట్!

మరో దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) తాజాగా 400 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల నుంచి పీకేసింది.

  • Written By:
  • Updated On - January 21, 2023 / 03:43 PM IST

వివిధ దేశాల్లో ఆర్థిక సంక్షోంభం నెలకొందా.. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఈ కామర్స్ సంస్థలు నష్టాల బాటలో నడుస్తున్నాయా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆర్థిక సంక్షోంభం (Financial Crisis) కారణంగా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ లాంటి సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. తమ తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. 1000కిపైగా కంపెనీలు గతేడాది లక్షా 50 వేల మందికిపైగా ఉద్యోగుల్ని తీసేసినట్టు తెలిసింది. ఇక ఈ ఏడాది కూడా సగటున రోజుకు 1600 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాయని ఒక సర్వేలో తేలింది. తాజాగా మరో దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో (Wipro) తాజాగా 400 మంది ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల నుంచి పీకేసింది. వీరందరికీ ఆఫర్ లెటర్స్ ఇచ్చినప్పటికీ ఆన్‌బోర్డింగ్ మాత్రం చేసుకోలేదని జనవరి 20న విప్రో (Wipro) స్పష్టం చేసింది. దీనికి కారణం కూడా వివరించింది.

ట్రైనింగ్ (Training) ఇచ్చినప్పటికీ పదే పదే అసెస్‌మెంట్‌లో (పరీక్ష) పేలవ ప్రదర్శన చేస్తున్నారని వివరణ ఇచ్చుకుంది. దీంతో తీసేయడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొంది. ‘విప్రోలో (Wipro) మేం కొన్ని అత్యున్నత ప్రమాణాలు పాటిస్తాం. వాటిని అందరిలో చూసేందుకు ప్రయత్నిస్తాం. వీటికి అనుగుణంగా మేం పనిచేసే అందరికీ మంచి నైపుణ్యాలు ఉండాలని కోరుకుంటాం. ఎంట్రీ లెవెల్ ఉద్యోగి అయినా.. వారి పనికి తగ్గ సామర్థ్యాలు వారిలో ఉండాలని మేం కోరుకుంటాం.’ అని విప్రో కంపెనీ ఒక ప్రకటన (Statement)లో తెలిపింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ సంస్థలు కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకున్న విషయం తెలిసిందే.

Also Read: Telangana Budget: ఫిబ్రవరి మొదటి వారంలో ‘తెలంగాణ’ బడ్జెట్