Site icon HashtagU Telugu

Liquor Home Delivery : మద్యం కోసం వైన్ షాప్ కు వెళ్తున్నారా..? ఇక మీకు ఆ శ్రమ అవసరం లేదు..!!

Liquor Home

Liquor Home

ప్రస్తుతం మొత్తం ఆన్లైన్ (Online) లోనే నడుస్తుంది. ఒకప్పుడు ఏది కావాలన్నా..ఏంతినాలన్న..ఏం తెచ్చుకోవాలన్న ఆయా షాప్స్ కు ..రెస్టారెంట్ కు వెళ్లి కావాల్సింది తెచ్చుకోవడం..తినడం చేసేవాళ్ళం. కానీ కరోనా దగ్గరి నుండి అంత మారిపోయింది. ఏదికావాలన్న ఇంటికే తెచ్చే హోం డెలివరీ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఉదయం టూత్ పేస్ట్ దగ్గరి నుండి పడుకునేటప్పుడు పెట్టుకొనే అల్ అవుట్ వరకు ఇలా ఏది కావాలన్నా క్షణాల్లో తెచ్చే హోం డెలివరీ (Home Delivery) అందుబాటులోకి వచ్చింది. మనకు ఏది కావాలన్నా చేతిలో స్మార్ట్ ఫోన్ నుండి క్లిక్ అనిపిస్తే చాలు..వెంటనే కాలింగ్ బెల్ కొట్టి డెలివరీ సార్ అంటూ వచ్చేస్తున్నారు. దీంతో చాలామందికి బయటకు వెళ్లి వెతుక్కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అన్ని వచ్చాయి కానీ మా మందుబాబులకు కూడా ఇలాంటి హోమ్ డెలివరీ అవకాశం కల్పించొచ్చు కదా..చుక్క మందు కోసం వెతుక్కొని ..పోయేపని తప్పుద్ది అంటూ కోరుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మందుబాబుల కోరిక అతి త్వరలోనే తీరబోతుంది. ప్రముఖ హోమ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ ద్వారా మద్యం (Wine Home Delivery) హోం డెలివరీ చేయాలని లిక్కర్ తయారీదారులు యోచిస్తున్నట్లు సమాచారం. పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, హరియాణా, పంజాబ్, గోవా, కేరళ, కర్ణాటక, తమిళనాడులో ముందుగా చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానం సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేయాలని వారు భావిస్తున్నట్లు టాక్. కాగా ఇప్పటికే ఒడిశా, పశ్చిమబెంగాల్లో మద్యం హోం డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త తెలిసి మందు బాబులు ఎక్కడో ఏమోకానీ ముందు అయితే తెలంగాణ లో దీనిని అందుబాటులోకి తీసుకరావాలని కోరుకుంటున్నారు.

వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ లోనే మద్యం అమ్మకాలు ఎక్కువ. అంతెందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు రన్ చేస్తుందంటే దానికి కారణం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తోనే..అందుకే మద్యం అమ్మకాల విషయంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన వేలు పెట్టదు. ఇంకాస్త అమ్మకాలను పెంచాలనే చూస్తుంది తప్పితే తగ్గించే పని మాత్రం చేయదు. ఇక ఇప్పుడు హోమ్ డెలివరీ వస్తే ఇంకాస్త అమ్మకాలు పెరగడం ఖాయం. మరి త్వరగా తెలంగాణ లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తే మందుబాబులు సంబరాలు చేసుకుంటారు.

Read Also : Anganwadi : అంగన్వాడీలకు శుభవార్త తెలిపిన మంత్రి సీతక్క

Exit mobile version