Ukriane: ఆ ఒక్కరూ లొంగిపోతే ఉక్రెయిన్ యుద్ధం ఆగిన‌ట్టేనా?

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఏ త‌క్ష‌ణ కార‌ణంతో యుద్దానికి దిగింద‌న్న‌దానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఉక్రెయిన్ నాటో కూట‌మిలో చేర‌కూడ‌ద‌న్న‌ది ర‌ష్యా ప్ర‌ధాన డిమాండు.

  • Written By:
  • Updated On - February 26, 2022 / 09:30 AM IST

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ఏ త‌క్ష‌ణ కార‌ణంతో యుద్దానికి దిగింద‌న్న‌దానిపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఉక్రెయిన్ నాటో కూట‌మిలో చేర‌కూడ‌ద‌న్న‌ది ర‌ష్యా ప్ర‌ధాన డిమాండు. నిజానికి ఇప్ప‌టికయితే ఉక్రెయ‌న్ నాటోలో చేర‌నే లేదు. అలాంట‌ప్ప‌డు యుద్ధం ఎందుక‌న్న‌దానిపై వాద‌న‌లు కొన‌సాగుతున్నాయి.

అధ్య‌క్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీని ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డ‌మే ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యంగా క‌నిపిస్తోంది. ర‌ష్యాకు త‌ను మొద‌టి టార్గెట్‌, త‌న కుటుంబం రెండో టార్గెట్ అని జెలెన్‌స్కీ స్వయంగా చెప్ప‌డంలో అంత‌రార్థం ఇదేన‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అధికారాన్ని స్వాధీనం చేసుకోవాల‌ని ఉక్రెయిన్ సైన్యానికి పుతిన్ పిలుపునిచ్చారు. దాని అర్థం కూడా అధ్య‌క్షున్ని తొల‌గించ‌డ‌మేన‌ని చెబుతున్నారు. నియో నాజీలు, ర్యాడిక‌ల్ నేష‌న‌లిస్టులైన జెలెన్‌స్కీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌జ‌ల‌ను కూడా కోరారు.

సైన్యం అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంటే చాలా త్వ‌ర‌గా ఒప్పందానికి రావ‌చ్చ‌ని కూడా పుతిన్‌ చెప్పారు. ర‌ష్యాకు, ప్ర‌ధానంగా త‌న‌కు వ్య‌తిరేకంగా ఉండే జెలెన్‌స్కీని తొల‌గించ‌డ‌మే టార్గెట్‌గా ఇంత సాహ‌సానికి దిగార‌ని నిపుణులు భావిస్తున్నారు. ఏదో విధంగా ఆయ‌న‌ను తొల‌గించి యుద్ధానికి ముగింపు ప‌ల‌కాల‌ని పుతిన్ భావిస్తున్న‌ట్టు అంచ‌నా. వేగంగా మారుతున్న ప‌రిణామాల మ‌ధ్య ఎలాంటి మార్పులు లు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.