ప్రపంచంలోనే అతి పురాతన పార్లమెంటు భవనాల్లో అది ఒకటి. దానికి 147 ఏళ్ళ చరిత్ర ఉంది. ఒకప్పుడు రాజ భవనంగా ఉన్న ఆ భవనం .. ఇప్పుడు దేశ పార్లమెంటుగా సేవలు అందిస్తోంది. అలాంటి ఘన చరిత్ర కలిగిన ఆ పార్లమెంట్ బిల్డింగ్ గురించి సాక్షాత్తు పార్లమెంట్ కమిటీయే సంచలన నివేదిక రిలీజ్ చేసింది. గట్టిగా గాలివాన వచ్చిందంటే పార్లమెంట్ బిల్డింగ్ కూలిపోతుందని(Parliament Building Collapse) వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ ఏ దేశానిది ఆ పార్లమెంటు బిల్డింగ్ ? అంటే.. బ్రిటన్ దేశానిది !! 147 ఏళ్ళ చరిత్ర కలిగిన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లోనే బ్రిటన్ పార్లమెంట్ ఉంది.
కమిటీ ఇచ్చిన వార్నింగ్ ఏమిటి ?
“ఇప్పుడు వర్షాకాలంలో వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ స్లాబ్ నుంచి వాటర్ లీక్ (Parliament Building Collapse) అవుతున్నాయి. పై కప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. అగ్ని ప్రమాదం సంభవించే ముప్పు కూడా ఉంది. బిల్డింగ్ లో 2,500 చోట్ల ఆస్టెబస్టాస్ ఉబ్బిపోయింది” అంటూ బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హెచ్చరించింది.దీని రిపేరింగ్ విషయంలో ప్రభుత్వం ఏళ్ళ తరబడి జాప్యం చేస్తుండటాన్ని ఈ కమిటీ తప్పుబట్టింది. పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా ప్యాచింగ్ పనులు మాత్రమే మొదలయ్యాయని మండిపడింది. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌ను భావి తరాల కోసం సురక్షితంగా కాపాడాలని నిర్ణయించామని బ్రిటన్ పార్లమెంటు అధికారులు చెప్తున్నారు. విస్తృత స్థాయిలో పునరుద్ధరణ పనులు చేయాలని ప్రణాళిక రచించినట్లు చెప్పారు. దీని కోసం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యులు, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులు ఈ ఏడాది చివర్లో ఓ తీర్మానాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ALSO READ : Funeral Cost 1655 Crores : ఆమె అంత్యక్రియల ఖర్చు 1,655 కోట్లు
సంవత్సరానికి 10 లక్షల మంది విజిటర్స్
ది ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్ వాస్తుశిల్ప రీత్యా అద్భుతమైన కట్టడం. దీనికి యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఉంది. సంవత్సరానికి దాదాపు 10 లక్షల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. దీనిని ఆర్కిటెక్ట్ చార్లెస్ బారీ డిజైన్ చేశారు. 1834లో పార్లమెంటు భవన సముదాయం అగ్ని ప్రమాదంలో ధ్వంసమవడంతో ఈ కొత్త భవనాన్ని నిర్మించారు.