Amit Shah : ఇండియా కూటమి గెలిస్తే రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి అవుతారా?: అమిత్‌ షా

Lok Sabha Elections 2024 : కేంద్రహోంమంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit Shah) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపిలోని సిద్ధార్ధనరగ్‌లో గురువారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మరోసారి విపక్ష ఇండియా కూటమి(Alliance of India)పై విమర్శలు గుప్పించారు. ఇండియా కూట‌మి క‌ల‌గూర‌గంప‌గా త‌యారైంద‌ని దుయ్య‌బ‌ట్టారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాక లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్నిక‌ల్లో మీకు మెజారిటీ ల‌భిస్తే మీ ప్ర‌ధాన […]

Published By: HashtagU Telugu Desk
Will Rahul Gandhi become Prime Minister if India alliance wins?: Amit Shah

Will Rahul Gandhi become Prime Minister if India alliance wins?: Amit Shah

Lok Sabha Elections 2024 : కేంద్రహోంమంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit Shah) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపిలోని సిద్ధార్ధనరగ్‌లో గురువారం జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మరోసారి విపక్ష ఇండియా కూటమి(Alliance of India)పై విమర్శలు గుప్పించారు. ఇండియా కూట‌మి క‌ల‌గూర‌గంప‌గా త‌యారైంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాక లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్నిక‌ల్లో మీకు మెజారిటీ ల‌భిస్తే మీ ప్ర‌ధాన మంత్రి ఎవ‌ర‌ని రాహుల్ గాంధీని ప్ర‌శ్నిస్తున్నాన‌ని అన్నారు. శ‌ర‌ద్ ప‌వార్‌, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, ఉద్ధ‌వ్ ఠాక్రే ప‌ద‌విని పంచుకుంటారా అని ప్ర‌శ్నించారు. విప‌క్ష ఇండియా కూట‌మి గెలిస్తే రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్ర‌ధాన మంత్రి(Prime Minister) అవుతారా? అని నిల‌దీశారు.

Read Also: Tammineni Sitaram : తమ్మినేని అహంకారమే ఆయనకు ముప్పుతెచ్చిందా..?

విప‌క్ష కూట‌మిలో ప్ర‌ధాని అభ్య‌ర్ధి(Prime candidate)పై వారికి స్ప‌ష్ట‌త లేద‌ని అన్నారు. ఇండియా కూట‌మి విజ‌యం సాధిస్తే ఏడాదికో ప్ర‌ధాని అవుతార‌ని చెప్పారు. దేశ ప్ర‌జ‌లు ప్ర‌ధానిగా మ‌రోసారి నరేంద్ర మోడీ(Narendra Modi)కి ప‌ట్టం క‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని అమిత్ షా పేర్కొన్నారు.

  Last Updated: 23 May 2024, 02:22 PM IST