Site icon HashtagU Telugu

PAN-Aadhaar Linking : పాన్-ఆధార్ లింక్.. రూరల్ పోస్టాఫీసుల్లో త్వరలో కొత్త సర్వీస్ ?

Pan Aadhaar Linking

Pan Aadhaar Linking

PAN-Aadhaar Linking : పాన్ కార్డును – ఆధార్ కార్డుతో లింక్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలోనే తప్పనిసరి చేసింది. 

అయితే ఇందుకోసం దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పెద్దగా సౌకర్యాలు లేవు. 

దీంతో జూన్ 30 డెడ్ లైన్ ముగిసినా..   కోట్లాది మంది రూరల్ ఏరియాల ప్రజలు పాన్ కార్డును – ఆధార్ కార్డుతో లింక్  చేసుకోలేకపోయారు.   

ఈనేపథ్యంలో గ్రామీణ ఏరియాలలోని  పోస్టాఫీసుల్లో  పాన్ కార్డును – ఆధార్ కార్డుతో లింక్ చేసే సర్వీసును అందుబాటులోకి తేవాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది.  

గ్రామీణ ప్రజల సౌకర్యార్ధం త్వరలోనే  ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Also read : 30 Missings: దడ పుట్టిస్తున్న మణిపూర్ అల్లర్లు, 3 నెలల్లో 30 మంది మిస్సింగ్

విలేజ్ ఏరియాలలోని లోకల్, సబ్ పోస్టాఫీసులలో పాన్-ఆధార్ లింక్ సౌకర్యం అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఎంతో సౌలభ్యం చేకూరుతుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డ్‌లను ఫ్రీగా లింక్ చేయడానికి సంబంధించిన  చివరి తేదీ జూన్ 30తో ముగిసింది. ఇప్పుడు ఆ కార్డులు లింక్ చేయాలంటే ఆలస్య  రుసుముగా రూ. 1000 చెల్లించాలి.అయితే పేదలకు ప్రయోజనం చేకూర్చే దృష్ట్యా గ్రామీణ పోస్టాఫీసుల్లో  ఈ సర్వీసును ఫ్రీగా అందించాలని(PAN-Aadhaar Linking)  తాజాగా లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి కోరారు.  ఆధార్ కార్డును లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయవు.

Also read : Rats Bites: భువనగిరి మార్చురీలో దారుణం.. మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!