Solar Eclipse: 2025 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం (Solar Eclipse) ఈ రోజు మార్చి 29, 2025 శనివారం రానుంది. ఈ రోజు చైత్ర మాసంలో అమావాస్య. ఈ రోజు చాలా అరుదైన సంయోగం కూడా ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ రోజు శనివారం. సుమారు 3 గంటల 53 నిమిషాల పాటు సూర్యగ్రహణం ఉంటుంది. ఇది మధ్యాహ్నం 2:21 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4:17 గంటలకు ముగుస్తుంది.
అయితే, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదని తెలుసుకోవాలి. సూర్యగ్రహణం సమయంలో ఏర్పడే సూతక కాలం కూడా భారతదేశంలో చెల్లుబాటు కాదు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, ఖండాలలో ప్రజలు దీనిని భూమి నుండి చూడగలరు. కానీ ఇది భారతదేశంలో ఎందుకు కనిపించదు? దీని గురించి తెలుసుకుందాం.
ఈ కారణంతో భారతదేశంలో కనిపించదు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోవడానికి కారణం గ్రహణం మార్గం. సూర్యగ్రహణం అనేది చంద్రుడు, భూమి, సూర్యుని మధ్యకు వచ్చినప్పుడు ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుని ఒక భాగం లేదా పూర్తి భాగం మాయమవుతుంది. కానీ సూర్యగ్రహణం కనిపించడం అనేది సూర్యుడు, చంద్రుడు, భూమి స్థానం ఎలా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది.
భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించకపోవడం అంటే గ్రహణం జరిగే సమయంలో దాని మార్గం భారతదేశం నుండి బయట ఉంటుంది లేదా సూర్యగ్రహణం సమయం, స్థానం భారతదేశంలో కనిపించే విధంగా ఉండదు. సూర్యగ్రహణం స్థానం భూమిపై వివిధ ప్రాంతాలలో విభిన్నంగా ఉంటుంది. అందుకే సూర్యగ్రహణం కొన్ని చోట్ల కనిపిస్తే, కొన్ని చోట్ల కనిపించదు.
ఈ ప్రాంతాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది
ఈ సూర్యగ్రహణాన్ని అమెరికా, కెనడా, గ్రీన్‌లాండ్, యూరప్, ఆఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, ఐస్‌లాండ్‌లో చూడవచ్చు. ఉత్తర అమెరికా నుండి సూర్యగ్రహణం అందమైన దృశ్యం కనిపిస్తుంది. ఉత్తర ధ్రువం, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఉత్తర ఆసియా, వాయవ్య ఆఫ్రికాలో సూర్యగ్రహణం బాగా కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికా దేశాలలో ఈ ఖగోళ సంఘటన ఉదయం మధ్య నుండి రాత్రి వరకు ఉంటుంది. అయితే ఉత్తర అమెరికాలో ఆంశిక గ్రహణం సూర్యోదయ సమయంలో ఉంటుంది.
Also Read: Solar Eclipse: నేడు సూర్యగ్రహణం.. భారతదేశంలో కనిపించనుందా?
తూర్పు యూరప్, ఉత్తర ఆసియా దేశాలలో ఇది మధ్యాహ్నం లేదా సాయంత్రం కనిపిస్తుంది. ఆంశిక సూర్యగ్రహణం కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్, లాబ్రడార్ వంటి నగరాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ సూర్యుడు 94 శాతం మేర కప్పబడి ఉంటాడు. కెనడా వలె గ్రీన్‌లాండ్‌లో నివసించే ప్రజలు కూడా లోతైన ఆంశిక సూర్యగ్రహణాన్ని చూస్తారు. అక్కడ సూర్యుని ఎక్కువ భాగం చంద్రునిచే కప్పబడి ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్‌లో, న్యూ హాంప్‌షైర్‌లో చాలా నీడ ఉంటుంది. అక్కడ సూర్యోదయ సమయంలో 64 శాతం వరకు సూర్య కాంతి మాయమవుతుంది. అదే సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి పశ్చిమ యూరప్ దేశాలలో నివసించే ప్రజలు ఈ గ్రహణాన్ని చూడగలరు. లండన్, పారిస్‌లో సుమారు 30 శాతం, 23 శాతం అస్పష్టంగా ఉంటుంది.