Patnam Narender Reddy : కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్టు విధానాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. వాకింగ్ కు వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను ఉగ్రవాదిలా అరెస్టు చేయడమేంటని నిలదీసింది. నరేందర్‌రెడ్డి ఏమైనా పరారీలో ఉన్నారా? అని పీపీపై ప్రశ్నల వర్షం కురిపించింది. దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని.. తీవ్ర గాయాలపై రిపోర్టు ఇచ్చి చిన్న గాయాలైనట్లుగా రాశారని పేర్కొంది. నరేందర్‌రెడ్డి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేందర్‌రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది.
లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. తనపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ నరేందర్ పిటిషన్‌లో కోరారు. దీని పైన విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపిస్తూ.. కాల్స్ చేసినందుకు అరెస్ట్ చేయడం సరికాదని, కనీసం అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని కోర్టుకు నివేదిం చారు. సుప్రీం తీర్పులు కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని, అరెస్ట్ గ్రౌండ్స్ చూడకుండానే నరేందర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించిందని న్యాయవాది వివరించారు.
ఇకపోతే..లగచర్ల ఘటన జరిగిన రోజు సురేష్‌తో నరేంద్ర ఎన్ని సార్లు ఫోన్‌లో మాట్లాడారని అడిగింది. ఘటనా స్థలంలో పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం ..పార్క్‌లో వాకింగ్ చేస్తున్న నరేందర్‌ను ఏ నిబంధనల ప్రకారం అరెస్ట్ చేశారంటూ ప్రశ్నలు సంధించింది. అతను ఏమైనా టెర్రరిస్టా అని సీరియస్ అయింది. కోర్టు ప్రశ్నలకు ప్రభుత్వ న్యాయవాది స్పందించారు.
నరేందర్ రెడ్డి లగచర్లలో అధికారుల పై దాడికి పరోక్షంగా ప్రేరేపించారని న్యాయవాది వాదించారు. ఘటన స్థలంలో నరేందర్ రెడ్డి లేకున్నా నిందితులకు ఆయనే డబ్బు సమకూర్చారని పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ నిందితులకు ఆయన సాయం అందిం చారని తన వాదనల్లో వివరించారు. అయితే నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని, ఆయన ఇంటి ముందు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, లగచర్ల ఘటన లో తనను అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది.
Read Also: Venkatesh : డీజే టిల్లు తో వెంకీమామ..?