Nose Ring Secrets : ముక్కు పుడక.. మహిళలకు స్పెషల్ లుక్ ఇస్తుంది.
ప్రస్తుత కాలంలో ముక్కు పుడకల హవా పెరిగింది.
సిల్వర్, గోల్డ్, ప్లాటినం, పగడపు ముక్కు పుడకలు, రత్నపు ముక్కు పుడకలు తెగ సేల్ అవుతున్నాయి.
కాలంతో పాటు ముక్కు పుడకల (Nose Ring Secrets) సైజు కూడా తగ్గింది. ప్రస్తుతం చిన్నసైజు ముక్కు పుడకల హవా నడుస్తోంది.
పెళ్లిళ్లు, ఫంక్షన్లు వస్తే చాలు..చాలామంది డ్రెస్సింగ్ కు తగ్గట్టుగా ముక్కుపుడకలు పెట్టేస్తూ స్టైల్ గా ముస్తాబవుతున్నారు.
ముక్కు పుడకను ముక్కుకు ఎడమవైపే పెట్టుకుంటారు.. ఇంతకీ ఎందుకలా ?
కుడి చేయి శుభప్రదం అయినప్పుడు.. కుడి వైపు ఉండే ముక్కు పుట శుభప్రదం కావాలి.
కానీ ముక్కు పుడక విషయంలో మాత్రం ఎడమవైపు ఉండే ముక్కు పుటకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
మహిళలకు ముక్కు కుట్టడం అనేది భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. వివాహిత స్త్రీ యొక్క 16 అలంకారాలలో ముక్కు పుడకను ధరించడం ఒకటి. దీనివల్ల అందం పెరుగుతుందని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు. వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు నుంచి పదకొండు సంవత్సరాల మధ్య వయస్కులకు ముక్కు కుట్టిస్తారు. ఇలా చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట. ముక్కుకు కుడివైపున సూర్యనాడి ఉంటుంది. ఎడమవైపున చంద్రనాడి ఉంటుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు. అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలం నుంచీ వస్తున్న సాంప్రదాయం.
Also read : Nose Surgery: అందం కోసం ముక్కు ప్లాస్టిక్ సర్జరీ.. కొంత సేపటికే మృత్యువాత!
కంట్రోల్ లోకి కోపం
- బంగారం, వెండి కలిపిన ముక్కు పుడకను ధరించడం మంచిదని అంటారు. బంగారం వల్ల శరీరానికి శక్తి.. వెండి వల్ల శరీరానికి చల్లదనం వస్తాయి. ఇక పూర్తిగా వెండితో తయారు చేసిన ముక్కు పుడకను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటారు.
- ముక్కు యొక్క ఎడమ పుటకు ఋతుస్రావంతో సంబంధం ఉంటుందని నమ్ముతారు. ముక్కు ఎడమ పుటను కుట్టిస్తే.. రుతుక్రమం కంట్రోల్ లోకి వస్తుందని చెబుతారు. దీనివల్ల మహిళలకు బహిష్టు సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు.
- జననాంగాలు, గర్భాశయానికి సంబంధించిన నాడికి ముక్కు ఎడమ భాగంతో సంబంధం ఉంటుందని.. ముక్కుకు ఎడమవైపున పుడకను ధరిస్తే గర్భకోశవ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు.
- పురిటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి ఇది సహకరిస్తుందట.
- ముక్కు పుడకను ధరించడం వల్ల నాసికా బిందువుపై ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా ఆడవారు తమ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారని అంటారు.
- ఈ ఆభరణం ఆడవారి శ్వాస నాళాలకు రక్షణ కల్పిస్తుంది. తద్వారా వాయుమార్గంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. సైనస్, ఇస్నోఫీలి వంటి ముక్కుకు సంబంధించిన సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది.
గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.