Universe : తోక కప్ప గెలాక్సీ గురించి మీకు తెలుసా.. విశ్వంలో ఇలాంటివి ఎన్ని ఉంటాయో తెలుసా?

ఖగోళ శాస్త్రాన్ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో తెలుసుకున్న కూడా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలానే ఉంటాయి.

  • Written By:
  • Publish Date - June 28, 2022 / 09:30 AM IST

ఖగోళ శాస్త్రాన్ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో తెలుసుకున్న కూడా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలానే ఉంటాయి. అంతే కాకుండా ఇంకా మనం విషయంలో తెలుసుకోవాలి అనిపించే విషయాలు అనంతంగా ఉంటాయి. ఈ అనంత విశ్వంలో ఉన్న తోక గొప్ప గెలాక్సీ అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఒక కప్ప గెలాక్సీ అసలు పేరు Arp 188. ఇది మనకు 4.2 కోట్ల కాంతి సంవత్సరాల అవతల డ్రాగన్ నక్షత్ర కూటమి రాశిలో ఉంది. దీని తోక ఏకంగా 2.8 లక్షల కాంతి సంవత్సరాల దూరం విస్తరించివుంది. ఈ తోకలో భారీ సరికొత్త నక్షత్రాలు బ్లూకలర్‌లో మెరుస్తూ ఉంటాయి. అవి చాలా కాంతివంతమైన యంగ్ నక్షత్రాలు.

అయితే విశ్వంలో ఈ గెలాక్సీ తో పాటుగా మిగతా గెలాక్సీలు ఉన్నప్పటికీ మిగతా ఏ గెలాక్సీలకూ ఇలాంటి తోక లేదు. దీనికి మాత్రమే ఎందుకు అన్నదానిపై ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఓ అంచనాకి వచ్చారు. పూర్వం ఈ గెలాక్సికి దగ్గర్లోనే మరో చిన్న గెలాక్సీ ఉండేది. దాన్ని Arp 188 ఆకర్షించింది. దాంతో అది వచ్చి దీన్ని ఢీకొట్టిందని ఆ సంఘటన దాదాపుగా 10 కోట్ల సంవత్సరాల కిందట ఇలా జరిగిందని అంచనా. ఆ ఘటనలో ఆర్ప్‌ 188కి చెందిన నక్షత్రాలు, గ్యాస్, దుమ్ము వీడిపోయి. ఇలా తోకలాగా ఏర్పడ్డాయని అంటున్నారు. ఇప్పటివరకూ ఏ స్పైరల్ గెలాక్సీ కీ ఈ స్థాయిలో దెబ్బ తగలలేదని అంటున్నారు శాస్త్రవేత్తలు.

 

అంతే కాకుండా ఆర్ప్ 188ని ఢీకొట్టిన మరో గెలాక్సీ ఇప్పటికీ ఉందని అది ఈ గెలాక్సీకి వెనకవైపున 3 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందట. దాన్ని చూడొచ్చనీ, దాని పై భాగంలోని కుడివైపున ఉన్న చుట్టలు కనిపిస్తాయని అంటున్నారు. భవిష్యత్తులో ఈ గెలాక్సీ తోక చెదిరిపోయే అవకాశం ఉంది అంటున్నారు అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా సైంటిస్టులు. ఎందుకంటే ఇప్పటికే ఈ గెలాక్సీ ముసలిదైపోయిందనీ. దీని శక్తి తగ్గిపోయిందని అంటున్నారు. తోకను మళ్లీ వెనక్కి లాక్కునేంత శక్తి లేదు అంటున్నారు. అందువల్ల చెదిరిపోయే తోకలోని నక్షత్రాల చుట్టూ ఉండే దుమ్ము క్రమంగా గ్రహాలుగా మారుతుందని అంటున్నారు. ఐతే ఇదంతా జరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుందని అంటే ఇప్పుడు మనం ఉంటున్న సౌర కుటుంబం లాంటివి అక్కడ కొత్తగా చాలా పుడతాయని అనుకోవచ్చు.