Site icon HashtagU Telugu

Putin : పుతిన్ మల,మూత్రాలు మోసేందుకు ఒక గార్డు!?

Putin Agrees To China Visit

Putin

రష్యా గూఢచారి స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన పుతిన్ చివరకు తన నీడను కూడా నమ్మడు. ఆహారం, వ్యాయామం, ఆరోగ్య సమస్యలు వంటి వివరాలలో ఏ ఒక్కటి కూడా విదేశీ గూఢచర్య సంస్థల చేతికి చిక్కకుండా అతి జాగ్రత్త పడతాడు. చివరకు తన మల, మూత్రాలపైనా ఓ కన్నేసి పెడతాడు పుతిన్ అంటూ “ప్యారిస్ మ్యాచ్” అనే ఫ్రెంచ్ మ్యాగజైన్ సంచలన కథనం ప్రచురించింది. ముఖ్యంగా విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడ బస చేసే అతిధి గృహల్లోని టాయిలెట్లలోనూ తన మల, మూత్రాలను పుతిన్ వదలడని ఆ కథనం పేర్కొంది. పుతిన్ రష్యా రాజధాని మాస్కోకు తిరిగి వచ్చే వరకు.. ఆయన వెంట ఉండే ఒక ప్రభుత్వ గార్డు ప్రత్యేక సూట్ కేసులో ఆ మలమూత్రాలను మోస్తాడని ప్రస్తావించింది. విదేశీ గూఢచర్య సంస్థలకు తన మల మూత్రాల శాంపిళ్ళు దొరికితే వాటిని పరీక్షించి .. తనకున్న వ్యాధులపై ఓ స్పష్టతకు వస్తారనే అనుమానం పుతిన్ కు ఉంది. అందువల్లే విదేశీ టూర్లకు వెళ్ళినప్పుడు వాటిని సూట్ కేసులో మోసేందుకు ఒక గార్డును పుతిన్ పెట్టుకున్నాడని కథనం విశ్లేషించింది. కాగా, పుతిన్ కు కంటి సమస్యలు, మానసిక సమస్యలు, బ్లడ్ క్యాన్సర్ ఉన్నాయని ఇటీవల ప్రచారం జరిగింది.