Netaji Grandson Vs Savarkar Movie : సావర్కర్ మూవీపై నేతాజీ ముని మనవడు ఫైర్

Netaji Grandson Vs Savarkar Movie : వీర సావర్కర్  బయోపిక్  'స్వాతంత్ర్య వీర్ సావర్కర్'కి సంబంధించిన టీజర్  మే 28న రిలీజ్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించిన  రణదీప్ హుడా .. స్వయంగా వీర సావర్కర్ పాత్రను పోషించారు.

  • Written By:
  • Publish Date - May 30, 2023 / 05:11 PM IST

Netaji Grandson Vs Savarkar Movie : వీర సావర్కర్  బయోపిక్  ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’కి సంబంధించిన టీజర్  మే 28న రిలీజ్ అయింది. ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించిన  రణదీప్ హుడా .. స్వయంగా వీర సావర్కర్ పాత్రను పోషించారు. అయితే మూవీ టీజర్ వీడియోలో వాడిన కొన్ని పదాలపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రకుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఆయన (వీర సావర్కర్) గొప్ప విప్లవకారుడు.. బ్రిటీష్ వారికి మోస్ట్ వాంటెడ్.. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ఖుదీరామ్ బోస్ లకు స్ఫూర్తిప్రదాత ” అని టీజర్ లో ప్రస్తావించడాన్ని చంద్రకుమార్ బోస్ తప్పు పట్టారు. సుభాష్ చంద్రబోస్ ఎన్నడూ సావర్కర్ ను రోల్ మోడల్ గా భావించలేదని స్పష్టం చేశారు. సుభాష్ చంద్రబోస్ భావజాలం..  సావర్కర్  భావజాలం రెండూ పూర్తిగా డిఫరెంట్, పూర్తిగా విరుద్ధమైనవని  ఆయన తేల్చి చెప్పారు. సుభాష్ చంద్రబోస్ పుస్తకాలు చదివితే ఈవిషయం ఇట్టే అర్ధమవుతుందన్నారు. టీజర్ లో వాడిన పదాలతో రణదీప్ హుడా చేసిన ట్వీట్ పైనా చంద్రకుమార్ బోస్ నిప్పులు చెరిగారు.

Also read : Gandhi : గాంధీ, నేతాజీ `బంధం` ఇదీ! కంగ‌నాకు అనిత బోస్ కౌంట‌ర్

నేతాజీకి స్ఫూర్తి ఆ ఇద్దరు మాత్రమే : చంద్రకుమార్ బోస్ 

“నేతాజీ సుభాష్ చంద్రబోస్ కేవలం ఇద్దరు గొప్ప వ్యక్తులను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నారు. ఒకరు స్వామి వివేకానంద, మరొకరు దేశబంధు చిత్తరంజన్ దాస్.  మరెవరినీ నేతాజీ స్ఫూర్తిగా తీసుకున్నారని నేను అనుకోవడం లేదు. నిజానికి సావర్కర్‌ను నేతాజీ వ్యతిరేకించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో సావర్కర్, మహమ్మద్ అలీ జిన్నా నుంచి మీరు ఏమీ ఆశించలేరని నేతాజీ ఒక పుస్తకంలో స్వయంగా రాశారు. హిందూ మహాసభ నుంచి ఏమీ ఆశించలేమని కూడా చెప్పారు. నేతాజీ సెక్యులర్ నాయకుడు. మతతత్వ వ్యక్తులను ఆయన వ్యతిరేకించాడు. సావర్కర్‌కు నేతాజీ మద్దతు ఇచ్చారని లేదా ఆయన అడుగుజాడల్లో నడిచారని మీరు ఎలా చెప్పగలరు? సెల్యులార్ జైలుకు వెళ్ళే వరకు సావర్కర్‌ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారుడు.. కానీ తరువాత సావర్కర్ మారిపోయారు”అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముని మనవడు చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యలు చేశారు.

ప్రచారం కోసం  చరిత్రను వక్రీకరించడం నేరం

“స్వాతంత్ర్య వీర్ సావర్కర్ సినిమా దర్శకుడు రణదీప్ హుడా వివాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా సినిమాకు(Netaji Grandson Vs Savarkar Movie) కొంత ప్రచారం, లాభం  వస్తుందని ఆయన అనుకుంటున్నట్టు ఉన్నారు.  కొంత ప్రయోజనం పొందడానికి.. ఇలా చరిత్రను వక్రీకరించడం నేరం. తప్పుడు చరిత్రను చూపించే హక్కు ఎవరికీ లేదని నా అభిప్రాయం” అని  చంద్రకుమార్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.