China Cricket: క్రికెట్ ను చైనా ఎందుకు పట్టించుకోదు?

చైనా రూటే సెపరేటు !! అందరూ గూగుల్ వాడుతుంటే.. వాళ్ళు మాత్రం సొంత సెర్చ్ ఇంజిన్ వాడుతారు.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 06:00 PM IST

చైనా రూటే సెపరేటు !! అందరూ గూగుల్ వాడుతుంటే.. వాళ్ళు మాత్రం సొంత సెర్చ్ ఇంజిన్ వాడుతారు. అందరూ క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతుంటే వాళ్ళు మాత్రం జిమ్నాస్టిక్స్ చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని కట్టిపడేసే క్రికెట్ .. చైనీయులను మాత్రం ఆకర్షించలేకపోయింది. ఫలితంగా నేటికీ చైనా క్రికెట్ టీమ్ ను మనం చూడలేదు. ఒలింపిక్స్ లోనూ అమెరికా, బ్రిటన్ లకు ధీటుగా పతకాలు సాధించే చైనా .. క్రికెట్ ను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? కారణం ఏమిటి ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి చాలామంది నెటిజన్స్ ఇంటర్నెట్ లో సమాధానం వెతుకుతుంటారు. దీనికి సూటి సమాధానం ఏమిటంటే.. “చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు”! ఇప్పుడు క్రికెట్ లో యాక్టివ్ గా, టాప్ ప్లేస్ లో ఉన్న దేశాలన్నీ ఒకప్పుడు బ్రిటీష్ ఏలుబడిలో ఉన్నవే. క్రికెట్ అనేది గ్లోబల్ స్పోర్ట్ కిందకి రాదు. దానికి ఒలంపిక్స్ లోనూ చోటు లేదు. అందుకే చైనా క్రికెట్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టదు.
అంతేకాకుండా చైనా లో ఎక్కువగా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ బాగా ఆడతారు. ఈ రెండు ఆటలు ఒలంపిక్స్ లోకి వస్తాయి. చైనా క్రికెట్ ఆడకపోవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

చైనా క్రికెట్ టీమ్ ఆటతీరు..

అయితే, చైనాకు కూడా క్రికెట్ టీం ఉంది. 2009 లో ఏసీసీ ట్రోఫీ ఛాలెంజ్ లో వాళ్ళ టీమ్ పాల్గొంది. కానీ మొదట మ్యాచ్ లలో ఓడిపోయింది.. ఆ తర్వాత మయన్మార్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి ఇంటర్నేషనల్ విజయం నమోదు చేసుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైనాలో కూడా క్రికెట్ ని ప్రమోట్ చేస్తోంది. 2019 లో జరిగిన టి 20 ఉమెన్స్ ఈస్ట్ ఏషియా కప్ టోర్నమెంట్ లో చైనాఉమెన్ టీం పాల్గొని విజయం సాధించింది.