Site icon HashtagU Telugu

Elephant Tusks : ఏనుగు దంతాలు ఎందుకంత కాస్ట్ ?

Elephant Tusks 

Elephant Tusks 

Elephant Tusks : ఏనుగు దంతాలు.. 

ఇవి ఎంతో కాస్ట్లీ.. 

వీటి ఒక కేజీ ధర రూ.10 లక్షల వరకు ఉంటుంది..

ఇంత ధర ఎందుకు ? వీటితో ఏం తయారు చేస్తారు ? 

ఏనుగు దంతాల వ్యాపారం చట్టవిరుద్ధం. ఈ వ్యాపారం చేస్తే..  వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని  సెక్షన్ 9 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే ఏనుగు దంతాల గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉంటుంది. నిజానికి చాలా దేశాల్లో  ఆభరణాల తయారీకి ఏనుగు దంతాన్ని ఉపయోగిస్తారు. మెడలో వేసుకునే హారాలు, కంకణాలు, మణికట్టుకు ధరించే బటన్లు వంటివి దీని నుంచి తయారు చేస్తారు. కొన్ని వర్గాల్లో వీటిని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అందుకే.. బంగారం కంటే కూడా ఏనుగు దంతాలు అత్యంత ఖరీదు చేస్తున్నాయి. ఏనుగు దంతాల స్మగ్లింగ్ అనేది .. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఏనుగు చేరేలా చేసింది. స్మగ్లర్లు దంతాల(Elephant Tusks) కోసం ఏనుగులను వేటాడి  చంపేస్తున్నారు. ఈనేపథ్యంలో ఏనుగు దంతాల వ్యాపారాన్ని ప్రభుత్వాలు నిషేధించాయి.

Also read : Russia Private Army : రష్యా ప్రైవేటు సైన్యాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా ?  

 

ఏనుగుకు 6 సార్లు దంతాలు ఊడిపోతాయి

ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువే జీవిస్తుంది. వాటి లైఫ్ టైంలో దంతాలు 6 సార్లు ఊడిపోయి మళ్ళీ వస్తాయి. మనం ఏనుగుకు రెండే దంతాలు ఉంటాయని అనుకుంటాం. వాస్తవానికి పైకి కనిపించే 2 పెద్ద దంతాలే కాకుండా నోటి లోపల మరో 24 దంతాలు కూడా ఏనుగుకు ఉంటాయి. ఏనుగు  పండ్లు, ఆకులు, కొమ్మలు, వేర్లు తిని బతుకుతుంది. భూకంపం వంటివి సంభవిస్తే మనుషుల కంటే ముందే ఏనుగులు గుర్తించగలవు.

ఏనుగు.. కష్టజీవి.. యుద్ధాలు..

ఏనుగుల గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ప్రాచీన భారతదేశంలో మొదటిసారిగా ఏనుగులను మచ్చిక చేసుకున్నారు. ఏనుగులు కష్టపడి పనిచేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి వాటిని అప్పట్లో  ఉపయోగించేవారు. ఇలాంటి పనులను ముఖ్యంగా ఆడ ఏనుగులను ఉపయోగించేవారు. యుద్ధాలలో మగ ఏనుగులను ఉపయోగించేవారు. భారీ బరువులు ఎత్తడానికి, దారి మధ్యలో ఉన్న వృక్షాలను కూల్చడానికి, పెద్దపెద్ద దుంగలను కదిలించడానికి, యుద్ధ ఖైదీలను వాటి పాదాల కింద తొక్కించడానికి వాడేవారు. ఆడ ఏనుగుకు 22 నెలల ప్రెగ్నెన్సీ తర్వాత ప్రసవం అవుతుంది.