తమిళ వెట్రి కజగం పార్టీ (TVK) పార్టీ అధినేత, సినీ నటుడు దళపతి విజయ్(Thalapathy Vijay) తమిళనాట రాజకీయ సమీకరణాలు మార్చబోతున్నట్లు తన ఫస్ట్ స్పీచ్ తో చెప్పకనే చెప్పాడు. ఆదివారం తమిళనాడు విల్లుపురం (Villupuram) జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) మహానాడు సభను ఏర్పాటు చేశారు. డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ పెరియార్‌తో పాటు తమిళ రాజకీయ నేతల కటౌట్స్ సభ జరిగింది. ఈ సభకు భారీ ఎత్తున అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. “నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ నేను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదు” అంటూ తన స్పీచ్ తో అదరగొట్టాడు.
విజయ్ మీటింగ్ తర్వాత ఇప్పుడు తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా విజయ్ పార్టీ.. DMK, AIDMKలో ఎవరి కొంప ముంచుతుందోనన్న చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ DMKకు అండగా ఉన్న క్రిస్టియన్, దళిత ఓట్లలో మెజారిటీ TVKకు వెళ్తాయని అంచనా. జయలలిత తర్వాత పటిష్ఠ నాయకత్వం లేక నైరాశ్యంలో ఉన్న AIDMK యూత్, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల న్యూట్రల్ ఓట్లూ కొంత టర్నవుతాయి. ఇది అసెంబ్లీలో 37% నుంచి లోక్సభలో 26%కి ఓట్లు పడిపోయిన DMKకే నష్టం కావొచ్చని అంచనా. అలాగే న్యూట్రల్ ఓట్లు అనే వర్గం.. ఈసారి డీఎంకే, ఎఐఏడీఎంకే కి కాకుండా విజయ్ పార్టీ కి మద్దతు పలకడం ఖాయం. ఈ పరిణామం రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చగలదు. మరి విజయ్ ఏంచేస్తాడో చూడాలి.
Read Also : Nara Lokesh : RTC డ్రైవర్ కు నారా లోకేష్ భరోసా..