King Charles III : కింగ్ చార్లెస్ తర్వాత బ్రిటన్ రాజు ఎవరు ? పోటీదారులు ఎవరెవరు ?

బ్రిటన్ రాజుగా చార్లెస్ IIIకి మే 6న అంగరంగ వైభవంగా పట్టాభిషేకం (king Charles III Succession) జరిగింది. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్, 14 కామన్వెల్త్ దేశాలకు చక్రవర్తి అయ్యాడు.

  • Written By:
  • Updated On - May 8, 2023 / 10:11 AM IST

బ్రిటన్ రాజుగా చార్లెస్ IIIకి మే 6న అంగరంగ వైభవంగా పట్టాభిషేకం (king Charles III Succession) జరిగింది. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్, 14 కామన్వెల్త్ దేశాలకు చక్రవర్తి అయ్యాడు. ఇటీవల తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II కన్నుమూయడంతో 74 ఏళ్ల చార్లెస్ రాజు అయ్యే అవకాశం పొందాడు. ఆయన రెండో భార్య కెమిల్లా రాణి అయ్యారు. ఈవిధంగా రాచరికం వారసత్వ (king Charles III Succession) కొనసాగుతున్న అతికొద్ది దేశాల్లో బ్రిటన్ ఒకటి. తాజాగా చార్లెస్ III పట్టాభిషేకం నేపథ్యంలో బ్రిటన్ రాజ కుటుంబం వారసత్వ మ్యాప్ (king Charles III Succession) పై డిస్కషన్ నడుస్తోంది. చార్లెస్ తర్వాత ఎవరు… ఆ తర్వాత ఇంకెవరు అనే దానిపై డిబేట్ జరుగుతోంది. దీనిపై వివరాలు ఇవీ..

కింగ్ జేమ్స్ II బ్రిటన్ విడిచి పారిపోయాక ఏమైందంటే.. ?

రాయల్ ఫ్యామిలీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం..బ్రిటన్ రాజ కుటుంబంలో వారసత్వ కేటాయింపు కోసం పునాది 17వ శతాబ్దంలో పడింది. ఈ ప్రక్రియను కూడా బ్రిటన్ రాజ్యాంగంలో ఒక భాగం చేశారు. దీనికి సంబంధించి హక్కుల బిల్లు (1689), సెటిల్మెంట్ చట్టం (1701) ఉన్నాయి. 1688లో కింగ్ జేమ్స్ II బ్రిటన్ విడిచి పారిపోయినప్పుడు, అతను ‘ప్రభుత్వాన్ని వదులుకున్నాడు’.. బ్రిటన్ క్రౌన్ ఖాళీ అయిందని ఆ దేశ పార్లమెంటు ప్రకటించింది. అనంతరం సింహాసనాన్ని జేమ్స్ II చిన్న కుమారుడు జేమ్స్‌కు బదులుగా జేమ్స్ కుమార్తె మేరీ, ఆమె భర్త విలియమ్‌3 (అప్పటి ఆరెంజ్‌ కౌంటీ పాలకుడు)లకు సంయుక్తంగా అప్పగించారు. అప్పటి నుంచి బ్రిటన్ సింహాసనానికి వారసుడి ఎంపికపై ఆ దేశ పార్లమెంట్ కు పట్టు వచ్చింది. రాజుగా ఉన్న వ్యక్తి సరిగ్గా లేకుంటే తొలగించే హక్కును కూడా పార్లమెంట్ పొందింది. ఇందులో భాగంగానే హక్కుల బిల్లు (1689), సెటిల్మెంట్ చట్టం (1701) లను పార్లమెంట్ తీసుకొచ్చింది. వీటి లెక్కన బ్రిటన్ రాజు వారసత్వం కేవలం రాజ కుటుంబం సంతతి ద్వారా మాత్రమే కాకుండా.. పార్లమెంటరీ చట్టం ద్వారా కూడా నిర్వహించబడుతుంది. అయితే ఇప్పటివరకు ఎన్నడూ రాజ కుటుంబం వారసత్వం వ్యవహారంలో బ్రిటన్ పార్లమెంట్ జోక్యం చేసుకోలేదు. ఆ విధంగా స్నేహపూర్వకంగా బ్రిటన్ పార్లమెంట్ , రాజ కుటంబం మధ్య సంబంధాలు కొనసాగాయి.

రోమన్ క్యాథలిక్ సింహాసనాన్ని అధిరోహించకుండా బ్యాన్

ఒక రోమన్ క్యాథలిక్ సింహాసనాన్ని అధిరోహించకుండా బ్యాన్ విధించారు. అంతేకాదు.. బ్రిటన్ రాజు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌తో కమ్యూనికేషన్ లో ఉండాలి. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్‌ లను సమర్థిస్తానని రాజు వాగ్దానం చేయాలి. ప్రొటెస్టంట్ వారసత్వాన్ని కాపాడుతానని రాజు ప్రతిజ్ఞ చేయాలి. 2013లో క్రౌన్ వారసత్వ చట్టానికి చేసిన సవరణ ప్రకారం.. రాజు కూతురు పెద్దది , కుమారుడు చిన్నవాడు అయిన సందర్భాల్లో కుమారుడికే సింహాసనం అప్పగించేలా మార్పులు చేశారు. 2011 అక్టోబర్ 28 తర్వాత జన్మించిన రాజ కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుంది. రోమన్ కాథలిక్‌లను వివాహం చేసుకున్న రాజ కుటుంబ సభ్యులను వారసత్వ రేఖ నుంచి నిరోధించే నిబంధనలను కూడా ఈ చట్టం రద్దు చేసింది.

ALSO READ : Bhadrakali Temple: కోహినూర్ వజ్రం పుట్టినిల్లు.. వరంగల్ భద్రకాళి ఆలయమే!!

చార్లెస్ III తర్వాత రాజు లేదా రాణి అయ్యే ఛాన్స్ వీరికే ..

* ది ప్రిన్స్ ఆఫ్ వేల్స్
* ప్రిన్స్ జార్జ్ ఆఫ్ వేల్స్
* వేల్స్ యువరాణి షార్లెట్
* ప్రిన్స్ లూయిస్ ఆఫ్ వేల్స్
* ది డ్యూక్ ఆఫ్ ససెక్స్
* ప్రిన్స్ ఆర్చీ ఆఫ్ ససెక్స్
* ససెక్స్ యువరాణి లిలిబెట్
* ది డ్యూక్ ఆఫ్ యార్క్
* ప్రిన్సెస్ బీట్రైస్, శ్రీమతి ఎడోర్డో మాపెల్లి మోజ్జి
* మిస్ సియెన్నా మాపెల్లి మోజ్జి
* ప్రిన్సెస్ యూజీనీ, శ్రీమతి జాక్ బ్రూక్స్‌బ్యాంక్
* మాస్టర్ ఆగస్ట్ బ్రూక్స్‌బ్యాంక్
* ఎడిన్‌బర్గ్ డ్యూక్
* ఎర్ల్ ఆఫ్ వెసెక్స్
* లేడీ లూయిస్ మౌంట్ బాటన్-విండ్సర్
* ది ప్రిన్సెస్ రాయల్
* మిస్టర్ పీటర్ ఫిలిప్స్
* మిస్ సవన్నా ఫిలిప్స్
* మిస్ ఇస్లా ఫిలిప్స్
* మిసెస్ మైఖేల్ టిండాల్
*మిస్ మియా టిండాల్
* మిస్ లీనా టిండాల్
*మాస్టర్ లూకాస్ టిండాల్

ప్రిన్స్ హ్యారీ, ఆండ్రూ మూడో వరుసలో ఎందుకు కూర్చున్నారు ?

యువరాజులు హ్యారీ, ఆండ్రూ.. కింగ్ చార్లెస్ III పట్టాభిషేకానికి హాజరయ్యారు . కానీ రాజకుటుంబ సీటింగ్‌లోని వీరిని మూడో వరుసలో కూర్చోబెట్టడం గమనార్హం. బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి బ్రిటన్ ప్రజలకు అభివాదం చేసిన రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ లో కూడా వీరు లేరు. చార్లెస్ చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ , అతని అమెరికన్ భార్య మేఘన్ 2020 లో రాజ కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టారు. ప్రిన్స్ హ్యారీ రాజ కుటుంబంతో అభిప్రాయ బేధాలు కలిగి ఉన్నాడు. ఇక ఆండ్రూ.. కింగ్ చార్లెస్ III పెద్ద సోదరుడు. US ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్‌.. ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఆయన ప్రతిష్టను దిగజార్చింది.