Site icon HashtagU Telugu

Twitter:ట్విట్టర్ సీఈఓ గా భారతీయుడు. ఆయన పూర్తి వివరాలు మీకోసం

Ca1ac 16382098132120 1920 Imresizer

Ca1ac 16382098132120 1920 Imresizer

సోషల్ మీడియా వేదికల్లో చాలా మంది ట్విట్టర్ ను ఇష్టపడుతారు. దీనికి కారణం ట్విట్టర్ పాలసీలు యూజర్స్‌కి ఫేవరేబుల్‌గా ఉంటాయి. పైగా సెక్యూరిటీ విషయంలో ట్విట్టర్ టాప్.
ఆయా దేశాల్లోని ప్రభుత్వాల ఒత్తిడులు ఎన్నున్నా పాలసీలో విషయంలో ట్విట్టర్ బలంగా ఉంది. దానికి కారణం జాక్ డోర్సేనే.
నలుగురు సహ వ్యవస్థాపకుల్లో ఒకడిగా ట్విట్టర్‌తో తన జీవితాన్ని ప్రారంభించి చివరికిసీఈవోగా ఎదిగిన జాక్ మొత్తంగా 16 ఏళ్ల పాటు ట్విట్టర్ తో సాగిన తన జర్నీకి ముగింపు చెప్పారు. ట్విట్టర్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల కంటే ట్విట్టర్ చాలా భిన్నమైంది. సంస్థ నష్టాల్లో పడ్డప్పుడు కూడా అడ్వర్టైజ్‌మెంట్ జోలికి అస్సలు వెళ్ళలేదు. రాజకీయాల నుంచి ఎంతగా ఒత్తిడి వచ్చినా పాలసీలు మార్చుకోలేదు. సెలెబ్రిటీ అయినా సాధారణ వ్యక్తి అయినా, అందరికీ ట్విట్టర్‌లో సమప్రాధాన్యత ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వాయిస్ ని పెద్ద వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలకు చేరే విధంగా ట్విట్టర్‌ను రూపొందించారు. ఇంతటి కృషిలో సింహభాగం డోర్సేదే.

చాలా మంది ట్విట్టర్ యూజర్లు డోర్సే తర్వాత ట్విట్టర్ ఎలాంటి మార్పులు చేసుకుంటుందో అన్న భయంలో ఉన్నారు. తాజాగా జాక్
వారసుడిగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ సీఈవోగా నియమితులయ్యారు. పరాగ్ అగర్వాల్‌ నియామకాన్ని ప్రశంసిస్తూ జాక్ ట్వీట్ చేసాడు. పరాగ్ పై తనకు చాలా నమ్మకం ఉందని, గత దశాబ్ద కాలంగా అయన పనితీరుని చూశానని, అతని నైపుణ్యం, హృదయం మరియు వ్యక్తిత్వానికి తాను చాలా కృతజ్ఞుడినని, ఆయన నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైందని జాక్ తెలిపారు.

పరాగ్ అగర్వాల్ ట్విట్టర్‌లో ఇంజనీర్‌గా తన వృత్తిని చేపట్టి తాజాగా సీఈవో గా బాధ్యతలు చేపట్టారు. పరాగ్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ లో చదివాడు. ఇంజనీరింగ్ తర్వాత, ముంబయ్ ఐఐటీ లో మాస్టర్స్ పూర్తి చేసి
స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో పిహెచ్‌డి పట్టా పొందారు.

2011లో ట్విట్టర్‌లో చేరిన పరాగ్ అంతకు ముందు కొంతకాలం మైక్రోసాఫ్ట్, యాహూలో పనిచేశాడు. ట్విటర్ సంస్థలో పరాగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వింగ్ లో పనిచేసాడు. 2017లో చీఫ్ టెక్నీకల్ ఆఫీసర్ గా ప్రమోషన్ పొందిన పరాగ్ తాజాగా సీఈవో అయ్యారు.