Physical Relationship: అబ్బాయిలు జర జాగ్రత్త.. మైనర్ తో శృంగారం చేసినా రేప్ కేసే!

తెలిసి తెలియని వయసులో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు శారీరక వ్యామోహానికి గురవుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Relationship

Relationship

కాలం మారుతోంది.. కాలంతో పాటు ఈ తరం అమ్మాయిలు, అబ్బాయిల (Girls and Boys) ఆలోచనలు సైతం మారుతున్నాయి. టీనేజ్ వయసులో విపరీత పోకడలకు అలవాటు పడుతున్నారు. సెల్ ఫోన్, సినిమాలు (Movies), ఫ్రెండ్స్, పార్టీలు అంటూ దారి తప్పిపోతున్నారు. ఇక చిన్న వయసులోనే బాయ్ ఫ్రెండ్ లేదా, గర్ల్ ఫ్రెండ్ తో శృంగారం (Physical Relationship) చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అంటే 14 నుంచి 18 ఏళ్ల (Minors) వయసులోనే రొమాన్స్ చేయడానికి ఓయో రూమ్స్, పార్కులకు వెళ్తున్నారంటే టీనేజ్ యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అయితే తెలిసి తెలియని వయసులో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు శారీరక వ్యామోహానికి గురవుతున్నారు. దీంతో శృంగారం చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు. అయితే చాలామంది చట్టాల (Indian Acts) గురించి సమగ్ర అవగాహన లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది జైళ్లు పాలు అవుతున్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 360 ప్రకారం మైనర్ అమ్మాయి (Minor Girl)తో, ఆమె అంగీకారంతో అబ్బాయి శృంగారం జరిపిన నేరమవుతుందని పోలీసులు, లాయర్లు చెబుతున్నారు. ఒకవేళ అబ్బాయి మైనర్ అయి మైనర్ అమ్మాయితో శృంగారం (Physical Relationship) చేసినా నేరమే అవుతుందని తేల్చి చెప్పారు.

ఒకవేళ మైనర్ అమ్మాయితో శృంగారం చేస్తే, వాళ్ల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆ మైనర్ బాలుడిపై రేప్ కేసు బుక్ చేయొచ్చు. ఫలితంగా అబ్బాయిల చదువులకు ఆటంకం కలుగుతుంది. విదేశీ చదువులకోసం బయటకు దేశాలకు వెళ్లాళన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కాబట్టి మైనర్ అబ్బాయిలు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైకాలజిస్ట్ లు. భారత చట్టాల ప్రకారం ఓ అమ్మాయితో సెక్సువల్ రిలేషన్ (Physical Relationship) పెట్టుకోవాలంటే కనీసం ఆ అమ్మాయి వయసు 18 దాటి ఉండాలని చట్టాలు హెచ్చరిస్తున్నాయి.

Also Read: Shraddha Das Navel show: నాభి అందాలతో రెచ్చిపోతున్న శ్రద్దా బ్యూటీ!

  Last Updated: 09 Feb 2023, 04:59 PM IST