Skanda Shasti : ఆ రోజు పూజిస్తే కార్తికేయుడు కరుణిస్తాడు

స్కంద షష్ఠి (Skanda shasti) పవిత్రమైన రోజు. శివుని పెద్ద కుమారుడు కుమారస్వామి ఆరాధనకు ఈ రోజు అంకితం. కార్తికేయుడిని "స్కంద కుమారుడు" అని పిలుస్తారు.

Published By: HashtagU Telugu Desk
Skanda Shasti

Skanda Shasti

స్కంద షష్ఠి (Skanda shasti) పవిత్రమైన రోజు. శివుని పెద్ద కుమారుడు కుమారస్వామి ఆరాధనకు ఈ రోజు అంకితం. కార్తికేయుడిని “స్కంద కుమారుడు” అని పిలుస్తారు. తొమ్మిది మంది దేవతా శక్తులలో స్కందమాత ఒకరు. అందుకే స్కంద షష్ఠి రోజున  ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. స్కంద షష్ఠి (Skanda shasti) వ్రతాన్ని ప్రతి మాసపు శుక్ల పక్షంలోని ఆరో  రోజున ఆచరిస్తారు. ఈసారి స్కంద షష్ఠి  వ్రతాన్ని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తేదీన అంటే  మే25న ఆచరించాలి. ఈ ఉపవాసం పాటిస్తే కుమార స్వామి అనుగ్రహం లభిస్తుంది. సంతోషకరమైన, సంపన్నమైన జీవితం లభిస్తుంది. పిల్లలకు పురోగతితో పాటు వారికి  సంతోషకరమైన జీవితం సొంతం అవుతుంది.  కార్తికేయుడిని ఆరాధించడం వల్ల ఆనందం, శ్రేయస్సు, అదృష్టం మరియు విజయాలు లభిస్తాయి. అనేక రకాల దుఃఖాలు దూరమవుతాయి. 

ఉపవాసం రోజు ఇలా.. 

కార్తికేయ భగవానుడిని దక్షిణ భారతదేశంలో మురుగన్ పేరుతో పూజిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం.. కార్తికేయుడు దేవతలకు కమాండర్-ఇన్-చీఫ్. కష్టాల్లో ఉన్న తన భక్తులను ఆయన ఆదుకుంటాడు. స్కంద షష్ఠి రోజున తెల్లవారుజామున నిద్రలేచి, స్నానం చేసి, ధ్యానం చేసి.. కార్తికేయుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని శుభ దిశలో ఏర్పాటు చేయండి. కార్తికేయునికి  చందనం, ధూపం, దీపం, పుష్పాలు, వస్త్రాలు సమర్పించండి. దీని తరువాత.. స్కంద షష్టి వ్రత కథను వినండి. ఈ రోజున కార్తీక మాత (పార్వతీ దేవి) , శివుడిని కూడా  పూజించండి. పూజ ముగింపులో కార్తికేయ స్వామికి హారతి కార్యక్రమం నిర్వహించి, కుటుంబ సభ్యులకు ప్రసాదాన్ని పంచండి.

also read : Mata Santoshi: సంతోషి మాత అనుగ్రహం పొందడానికి ఇలా పూజ చేయండి.. పూజ విధానం ఇదే..!

స్కంద షష్ఠి వ్రత పూజ..

స్కంద షష్ఠి వ్రతం రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేసి సూర్యభగవానునికి  నీరు సమర్పించండి. ఆ తర్వాత కార్తికేయ స్వామికి పూలు, పండ్లు, బియ్యం, ధూపం, దీపం, సువాసన, ఎర్రచందనం, నెమలి ఈకలు మొదలైన వాటిని సమర్పిస్తూ .. షష్టి స్తోత్రాన్ని పఠించండి. మీ జీవితంలో మంచి జరగాలని కోరుకోండి. కార్తికేయుడికి నెమలి ఈకను నైవేద్యంగా పెట్టండి. నెమలి ఈకను సమర్పిస్తే కార్తికేయుడు చాలా సంతోషిస్తాడు.

  Last Updated: 20 May 2023, 12:34 PM IST