Site icon HashtagU Telugu

WhatsApp Multi Account : వాట్సాప్ లో మల్టీ అకౌంట్ ఫీచర్‌.. ఒక ఫోన్ లో ఎన్ని అకౌంట్లయినా లాగిన్ కావచ్చు

Whatsapp Multi Account

Whatsapp Multi Account

WhatsApp Multi Account :  వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను తీసుకు రానుంది. 

ఆ ఫీచర్ గురించి తెలిస్తే మీరెంతో సంతోషిస్తారు.. !

అదే..  వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్‌. 

దీని ద్వారా ఇకపై మనం ఫోన్ లేదా ల్యాప్ ట్యాప్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్ ఖాతాలలోకి ఏకకాలంలో  లాగిన్ కావచ్చు.

Also read : Today Horoscope : ఆగస్టు 11 శుక్రవారం రాశి ఫలితాలు.. వారిపై ఒత్తిళ్లు అధికం

వాట్సాప్ యూజర్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళగానే ఒక QR కోడ్ కనిపిస్తుంది. దాని పక్కనే ఒక బాణం గుర్తు ఉంటుంది.  దానిపై నొక్కితే..  ప్రస్తుతం లాగిన్ చేసి ఉన్న వాట్సాప్ అకౌంట్  వివరాలు కనిపిస్తాయి. దాని కిందే మరొక వాట్సాప్  ఖాతాను యాడ్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఈజీగా మరో వాట్సాప్ అకౌంట్ ను మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎన్ని వాట్సాప్ అకౌంట్లనైనా మనం  ఫోన్ లేదా ల్యాప్ ట్యాప్ లో యాక్టివ్ చేసుకోవచ్చు. మనం లాగ్ అవుట్ చేసే వరకు ఈ అన్ని వాట్సాప్ అకౌంట్స్ అక్కడే లైవ్ లో అందుబాటులో ఉంటాయి. దీనివల్ల వాట్సాప్ అకౌంట్స్ నిర్వహణ అనేది ఈజీగా మారుతుందని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం మనం  వాట్సాప్  లో ఒకసారి ఒక అకౌంట్ లోకి లాగిన్ అయ్యే అవకాశాన్ని మాత్రమే కలిగి ఉన్నాం.  ఈ ఫీచర్ ను గత నెలలోనే వాట్సాప్ బిజినెస్ బీటా వినియోగదారులతో  టెస్ట్ చేయించారు.  ప్రస్తుతం కొంతమంది సాధారణ వాట్సాప్ బీటా వినియోగదారులతో టెస్టింగ్(WhatsApp Multi Account) జరుగుతోంది.  ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.17.8లోని WhatsApp బీటాలో ఇప్పుడు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

 

Also read : Telangana GDP Jump : తలసరి నికర ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ : కేంద్రం

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో కాల్‌ షెడ్యూల్ .. 

వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో కాల్‌లను షెడ్యూల్ చేయడానికి మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ విడుదల చేస్తోంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులు తమకు ఫ్యూచర్ లో  రాబోయే గ్రూప్ కాల్‌ల గురించి ప్లాన్ చేసుకోవచ్చు. ఇతర పార్టిసిపెంట్‌లు అందరికీ ఈవిషయాన్ని ఆటోమేటిక్‌గా తెలియజేయవచ్చు. గ్రూప్ చాట్‌లలో కాల్‌లను షెడ్యూల్ చేయడం యూజర్స్ కు అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు అంటున్నారు.

వీడియో కాలింగ్ లో రెండు కొత్త ఫీచర్‌ లు..

మరోవైపు WhatsApp ఈ వారమే వీడియో కాలింగ్ లో రెండు కొత్త ఫీచర్‌లను పరిచయం చేసింది.  స్క్రీన్ షేరింగ్, ల్యాండ్‌స్కేప్ మోడ్ సపోర్ట్ ను అందుబాటులోకి తెచ్చింది. స్క్రీన్ షేరింగ్ ఆప్షన్‌తో, WhatsApp వినియోగదారులు ఇప్పుడు వీడియో కాల్ సమయంలో వారి ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ని ఇతర పార్టిసిపెంట్‌లతో షేర్ చేసుకోవచ్చు. వీడియో కాల్ సమయంలో డాక్యుమెంట్స్ ను, ఫోటోలను కూడా ఇతర పార్టిసిపెంట్‌లకు షేర్ చేయొచ్చు.  అందరూ వీడియో కాల్ మాట్లాడుతూ  ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు.