Site icon HashtagU Telugu

WhatsApp Outage: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. షాక్ లో యూజర్స్!

Whatsapp

Whatsapp

వాట్సాప్ యూజర్స్ కు బిగ్ షాక్.. గత కొన్ని గంటలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ కమ్యూనికేషన్ యాప్ వాట్సాప్ పనిచేయకపోవడంతో యూజర్స్ లబోదిబోమంటున్నారు. మేసేజలు పంపలేక, రిసీవ్ చేసుకోలేక ఇబ్బంది పడ్తున్నారు. వ్యక్తిగత మేసేజ్‌లతో పాటు గ్రూప్ మెసేజింగ్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది.

వేలకొద్దీ వినియోగదారుల వాట్సాప్ పని చేయడం లేదని అవుట్‌టేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్ DownDetector కుడా క్లారిటీ ఇచ్చింది. సాంకేతిక సమస్యతో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సతమతమవుతున్నాయి . Whats APP  కనెక్ట్ కాకపోవడంతో దేశవ్యాప్తంగా కొన్ని కీలకమైన సేవలు నిలిచిపోయాయి.