WhatsApp Memes: వాట్సాప్ కు గ్రహణం.. మీమ్స్ తో చెలరేగిన నెటిజన్స్!

కొద్ది గంటల క్రితమే వాట్సాప్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే యూజర్స్ ఎంతగా విలవిలలాడిపోయారో.. అంతకుమించి

  • Written By:
  • Updated On - October 25, 2022 / 04:23 PM IST

కొద్ది గంటల క్రితమే వాట్సాప్ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే యూజర్స్ ఎంతగా విలవిలలాడిపోయారో.. అంతకుమించి మీమ్స్ తో చెలరేగిపోయారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాట్సాప్ ఇంజినీర్లు రైట్ నౌ అంటూ పెట్టిన కొన్ని పోస్టులు చూస్తే నవ్వకుండా ఉండలేం. వాట్సాప్ పని చేయకపోవడంతో  మొదటగా అందరూ తమ నెట్ ఉందో లేదో చెక్ చేసుకుని ఉంటారు.  వైఫై ఎందుకు పోయిందో  అని ప్రోవైడర్‌ను నిందించుకుని ఉంటారు. దాన్ని గుర్తు చేస్తూ పెట్టిన మీమ్ అందర్నీ నవ్విస్తోంది.

కాసేపు ఆగిపోతే ఎంతగా అల్లాడిపోయార్రా…

అందులో
పులిహార కలిపేవాళ్లు ఉన్నారు….
వాట్సప్ యూనివర్శిటి విద్యార్దులు, ప్రొఫెసర్లు ఉన్నారు….
స్టేటస్ బ్యాచులు ఉన్నారు…
గుడ్ మార్నింగ్ ,గుడ్ నైట్ బ్యాచ్లు ఉన్నారు..

అందరి కోరిక ఒకటే…
ఒరేయ్ జూకరూ వాట్సప్ ఆగిపోయింది .. ఆన్ చేయ్.. ఆగిపోయింది ఆన్ చేయ్…

ఏమిచ్చాడ్రా జూకర్ మనకి …ఆస్తులిచ్చాడా ఏదైనా ఇచ్చాడా.. మీటా ఇచ్చాడు డేటా వేసి వాడుకోమన్నాడు…

ఈ జన్మకే వాడు మనకి జూకర్..
ఈ జన్మకే జూకర్ గాడికి మనం…
జన్మల వరుకు ఎందుకురా వాట్సప్ , fb , ఇన్స్టా లేకపోతే వాడెవడో మనం ఎవరిమో…

అందరం మేము బాగుండాలి అని కోరుకోవడంతో పాటు జూకర్ కూడా బాగుండాలి కోరుకోవాలి…