WhatsApp – New Interface : వాట్సాప్ ఇంటర్ ఫేస్ త్వరలో ఇలా మారిపోతుంది..!!

WhatsApp - New Interface :  వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో కళకళలాడుతోంది. యూజర్ ఇంటర్‌ఫేస్ (User interface) డిజైన్‌ను కూడా త్వరలోనే వాట్సాప్ మార్చేయనుంది.

  • Written By:
  • Publish Date - September 2, 2023 / 09:18 AM IST

WhatsApp – New Interface :  వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లతో కళకళలాడుతోంది. యూజర్ ఇంటర్‌ఫేస్ (User interface) డిజైన్‌ను కూడా త్వరలోనే వాట్సాప్ మార్చేయనుంది. ఇప్పటికే రౌండెడ్ మెనూస్‌, ఐకాన్స్ ను తీసుకొచ్చిన వాట్సాప్.. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చేయబోతోంది. ఆ ఫీచర్స్ కూడా యాడ్ అయితే వాట్సాప్ ను యూజర్స్ గుర్తించడం ఇంకా ఈజీ అవుతుందని టెక్ గాడ్జెట్స్ నిపుణులు అంటున్నారు. యాప్‌లు లేదా ఫోన్ల గురించి పెద్దగా తెలియని వారు కూడా వాట్సాప్ ను ఇక సులభంగా గుర్తించగలుగుతారని చెబుతున్నారు.

Also read : Hyderabad ECIL – Aditya L1 : ‘ఆదిత్య ఎల్‌-1’ ప్రయోగంలో హైదరాబాద్ ఈసీఐఎల్‌, మిధానీ పరికరాలు

ఆ సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్ (UI)  వచ్చేస్తే.. వాట్సాప్ నావిగేషన్ బార్‌ స్క్రీన్ కిందే కనిపిస్తుంది. ఆ బార్‌లో చాట్, స్టేటస్, కాల్స్, కమ్యూనిటీల కోసం కొత్త ట్యాబ్‌ ఉంటుంది. యాప్ పై భాగం నుంచి గ్రీన్ కలర్ రిమూవ్ అవుతుంది. వాట్సాప్ యూజర్ల కోసం డెవలప్ చేస్తున్న కొత్త డిజైన్‌లో గ్రీన్ కలర్ టాప్ యాప్ బార్‌కు బదులుగా వైట్ టాప్ యాప్ బార్ కనిపిస్తుంది. కొత్త యూజర్ ఇంటర్ ఫేస్ డిజైనింగ్ ప్రస్తుతం ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. తొలుత దీన్ని వాట్సాప్ బీటా టెస్టర్ల కోసం రిలీజ్ చేస్తారు. ఆండ్రాయిడ్ వర్షన్ లోని వాట్సాప్ బీటా లేటెస్ట్ అప్‌డేట్‌లో యాప్ లోని ఎగువ భాగంలో ఉండే బార్‌కి కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేసినట్టు కనిపించింది. దాన్ని బట్టి వాట్సాప్ సరికొత్త యూజర్ ఇంటర్ ఫేస్ వచ్చే సమయం బాగా దగ్గరపడిందనే (WhatsApp – New Interface) సిగ్నల్స్ అందాయి.

Also read : Today Horoscope : సెప్టెంబరు 2 శనివారం రాశి ఫలాలు.. వారు పనుల్ని వాయిదా వేసుకోవడం మంచిది

వాట్సాప్ ఇంటర్ ఫేస్ లో జరగబోయే ఛేంజెస్.. 

  • వాట్సాప్ స్టేటస్ బార్ వైట్ కలర్‌ లోకి మారిపోతుంది.
  • వాట్సాప్ యాప్ నేమ్ ఫాంట్‌ మారుతుంది.
  • వాట్సాప్ యాప్ నేమ్ గ్రీన్‌ కలర్‌లో ఉంటుంది.
  • కొత్త UI డిజైన్ వచ్చాక.. వాట్సాప్ ఇంటర్ ఫేస్ లోని గ్రీన్‌ కలర్‌ మోతాదు చాలావరకు తగ్గుతుంది.
  • వాట్సాప్ లోగో, మెసేజ్ బటన్ ముదురు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి.
  • వాట్సాప్ చాట్స్‌ పైన ఆల్, అన్‌రీడ్, పర్సనల్, బిజినెస్ వంటి కొత్త ఫిల్టర్ ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్లపై క్లిక్ చేస్తే అవి లైట్ గ్రీన్ కలర్‌లోకి మారుతాయి.
  • కొత్త UI డిజైన్‌లో వాట్సాప్ యాప్ పైభాగంలో ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది.
  • వాట్సాప్ ఛాట్స్ మధ్య లైన్‌లు లేకుండా యాప్ పూర్తిగా వైట్‌గా కనిపిస్తుంది.