WhatsApp Passkeys : వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు వాట్సాప్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యేందుకు ఆండ్రాయిడ్ యూజర్స్ పాస్ వర్డ్ లను వాడుతున్నారు. ఇకపై పాస్ కీ ఉంటే చాలు. వాట్సాప్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఈవిషయాన్ని ప్రకటించింది. పాస్ కీ ఫీచర్ వల్ల తమ యూజర్స్ భద్రత మరింత పెరుగుతుందని వాట్సాప్ అంటోంది. పాస్‌కీ సహాయంతో వాట్సాప్ అకౌంట్లోకి లాగిన్ కావడానికి మునుపటి కంటే తక్కువ టైం పడుతుందని చెబుతోంది. ఇక పాస్ కీ ఉంటే.. యూజర్ ఫేస్, ఫింగర్ ప్రింట్ లేదా పిన్ ను ఎంటర్ చేసి అకౌంట్లోకి ఈజీగా లాగిన్ అయిపోవచ్చని వాట్సాప్ వెల్లడించింది. అయితే ఐఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందా ? రాదా ? అనే దానిపై వాట్సాప్ క్లారిటీ ఇవ్వలేదు.
Android users can easily and securely log back in with passkeys 🔑 only your face, finger print, or pin unlocks your WhatsApp account pic.twitter.com/In3OaWKqhy
— WhatsApp (@WhatsApp) October 16, 2023
We’re now on WhatsApp. Click to Join.
గతంలో ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా ఛానెల్‌లో పరీక్షించి, మెరుగైన ఫలితాలు రావడంతో ఇప్పుడు అధికారికంగా రిలీజ్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. రాబోయే కొన్ని నెలల్లో వాట్సాప్ యూజర్స్ అందరికీ విడతలవారీగా పాస్‌కీ ఫీచర్ అందుబాటులోకి రానుంది. యాపిల్, గూగుల్ కంపెనీలు ఇప్పటికే తమ యూజర్స్ సౌకర్యార్ధం పాస్ కీ ఫీచర్ ను రిలీజ్ చేశాయి. పాస్‌కీల ద్వారా అకౌంట్లలోకి లాగిన్ కావడం అనేది పాస్‌వర్డ్‌లతో పోల్చుకుంటే 40% వేగంగా జరుగుతుంది. క్రిప్టోగ్రాఫిక్ పద్ధతిలో ఈ పాస్ కీలను మనం వాడే డివైజ్ లలో నిక్షిప్తం (WhatsApp Passkeys) చేస్తారు.