Ram Lalla Idol : నల్లటి ఏకశిలతో చెక్కిన 51 అంగుళాల పొడవున్న బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విగ్రహానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలిశాయి. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని చెక్కారు. దీని బరువు దాదాపు ఒకటిన్నర టన్నులు. రామమందిరం గర్భగుడిలో ప్రతిష్టించేందుకు బాలరాముడి మూడు విగ్రహాలను తయారు చేయించగా.. ముఖంలోని మృదుత్వం, చూపు, చిరునవ్వు, శరీరం ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. బాలరాముడి విగ్రహం తయారీకి వాడిన రాయిపై నీరు, పాలు వంటి ద్రవాలు ప్రతికూల ప్రభావాన్ని చూపలేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలో.. రాముడి సోదరుల విగ్రహాలు, సీత, హనుమంతుడి విగ్రహాలను రామమందిరం మొదటి అంతస్తులో ఉంచుతారు. అయితే మొదటి అంతస్తులో విగ్రహాలను ప్రతిష్ఠించడానికి మరో ఎనిమిది నెలల టైం పడుతుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. రాజస్థాన్‌కు చెందిన మరో ఇద్దరు కళాకారులు చెక్కిన ఇంకో రెండు బాలరాముడి విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జనవరి 22న అయోధ్య రామాలయ మహా శంకుస్థాపన జరగనుంది. ఆ రోజు జరిగే రామ్ లల్లా శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా పలువురితో ప్రధాని మోడీ వేదికను పంచుకోనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా 7,000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకకు ఆహ్వానించబడ్డారు. జనవరి 14 నుంచి అయోధ్యలోని దేవాలయాలలో భజనలు, రామ్‌లీల నాటకాల ప్రదర్శనలు, ప్రత్యేక పూజలు, యజ్ఞాలు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈనేపథ్యంలో బీజేపీ దేశవ్యాప్తంగా బూత్ స్థాయిలో రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించడానికి ప్రణాళికలను రచిస్తోంది. జనవరి 23 నుంచి సాధారణ భక్తుల కోసం రామమందిరం తెరవబడుతుంది.
Also Read: Bangladesh – Super Powers : నేడే బంగ్లాదేశ్ పోల్స్.. నాలుగు సూపర్ పవర్స్‌కు ఇంట్రెస్ట్ ఎందుకు ?
అయితే అయోధ్యలో రామమందిరం కాకుండా ‘జానకి మహల్ ఆలయం’ కూడా ఉంది. ఈ మందిరంలో భక్తులు శ్రీ రాముడిని అల్లుడిగా భావిస్తారు. భారత్‌లో అల్లుడిని ఎంతో ప్రత్యేకంగా, గౌరవంగా చూసుకుంటారు. అదే సంప్రదాయాన్ని జానకి మహల్ ఆలయాంలోనూ అనుసరిస్తూ భక్తులు ప్రతిరోజు రామయ్యను స్మరిస్తూ భజనలు చేస్తారు.