Gangubai & Nehru: నెహ్రూతో ‘గంగూబాయి’ రిలేషన్ షిప్.. అసలేం జరిగిందంటే!

బాలీవుడ్ ఫేం ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్న వచ్చిన ఈ సినిమా ట్రైలర్ జనాలకి బాగా నచ్చడంతో పాటు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • Written By:
  • Updated On - February 17, 2022 / 02:16 PM IST

బాలీవుడ్ ఫేం ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్న వచ్చిన ఈ సినిమా ట్రైలర్ జనాలకి బాగా నచ్చడంతో పాటు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కథ ఎస్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీ యా క్వీన్ ఆఫ్ ముంబై’ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. గంగూబాయి గూండాల వరకు మాత్రమే కాకుండా, పెద్ద, పెద్ద రాజకీయ నాయకులను కూడా ఆమె ప్రభావితం చేసింది. మహిళా సాధికారత సదస్సు నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా ఫేం సంపాదించుకున్న గంగూబాయి వేశ్యలకు అనుకూలంగా ప్రసంగం చేసింది. క్రమంగా గంగూబాయి చర్చల సయమంలో ప్రధానమంత్రిగా ఉన్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు కూడా చేరాయి.

దీని తరువాత దేశంలో రెడ్ లైట్ ఏరియాల పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరిగాయి. మహిళా సాధికారత శిఖరాగ్ర సమావేశంలో మహిళల సాధికారత గురించి ప్రసంగించారు. దీని ప్రతిధ్వని దేశ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు చేరింది. గంగూబాయి ప్రసంగంపై చర్చ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వద్దకు చేరినప్పుడు, గంగూబాయికి ఒకసారి జవహర్‌లాల్ నెహ్రూను కలిసే అవకాశం లభించింది. సెక్స్ వర్కర్ల పరిస్థితిని జాతీయ స్థాయిలో మెరుగుపరచాలనే అంశాన్ని నెహ్రూ తన ప్రసంగాల ద్వారా లేవనెత్తాలని ఆమె కోరింది. గంగూబాయి ఈ సమాజంలోని ఇతర వ్యక్తులు పొందినట్లుగా వేశ్యలకు హక్కులు పొంది గౌరవప్రదంగా నడిపించేలా ఏదైనా చేయాలని కోరారు. అయితే గంగుబాయి పోరాట పటిమ మెచ్చిన నెహ్రూ బహుమతిగా ఓపూలదండను బహుమతిగా ఇచ్చారని అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. తనను పెళ్లి చేసుకోవాలని గంగూబాయి నెహ్రూను కోరిందట. గంగూబాయి సినిమా విడుదలైతే మరిన్ని విషయాలు తెలుస్తాయి.