Dawoods Plot : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను ఇటీవల ప్రభుత్వం వేలం వేసిన సంగతి తెలిసిందే. అతడి ఆస్తుల్లో ఒకటైన ఓ ప్లాట్‌ను శివసేన మాజీ నాయకుడు, న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ రూ.2 కోట్లకు కొన్నారు. సర్వే నంబరు, న్యూమరాలజీలో తనకు అనుకూలంగా ఉండే నంబరు ఒకటే కావడంతో ఇంత భారీ రేటు పెట్టి ఆ ప్లాట్‌ను కొన్నానని ఆయన తెలిపారు. ముంబైలోని నాగ్‌పాడా ఏరియాలో ఉన్న ఆ స్థలంలో సనాతన పాఠశాలను నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ‘‘నేను సనాతన హిందువును. మేం మా పండిట్‌జీని అనుసరిస్తాం. సర్వే నంబర్, సంఖ్యాశాస్త్రం ప్రకారం నాకు అనుకూలంగా ఉండే సంఖ్య ఒకటే అని మా పండిట్‌జీ అన్నారు. అందువల్లే దావూద్ ప్రాపర్టీని కొన్నాను. నా పేరుకు అది ట్రాన్స్‌ఫర్ కాగానే.. సనాతన పాఠశాలను ప్రారంభిస్తాను’’ అని శ్రీవాస్తవ(Dawoods Plot) వివరించారు.
We’re now on WhatsApp. Click to Join.
- న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ దావూద్ ఆస్తులను కొనడం ఇదే తొలిసారేం కాదు.. గతంలో దావూద్ చిన్ననాటి ఇల్లుతో సహా అండర్ వరల్డ్ డాన్ యొక్క మరో మూడు ఆస్తులను కూడా కొన్నారు. ఆ వివరాలలోకి వెళితే.. 2001 మార్చిలో జరిగిన వేలంపాటలో శ్రీవాస్తవ మాత్రమే బిడ్ దాఖలు చేశారు. దీంతో నాగ్‌పాడా ఏరియాలోని దావూద్‌కు చెందిన రెండు దుకాణాలు అజయ్ శ్రీవాస్తవ వశమయ్యాయి.
- ముంబకే గ్రామంలోని ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇంటిని 2020లోనే న్యాయవాది అజయ్ శ్రీవాస్తవ కొన్నారు. పత్రాల్లో ఉన్న కొన్ని తేడాల కారణంగా ఆ బంగళాకు సంబంధించిన డీడ్ ఇంకా ఆయన చేతికి రాలేదు. ఇప్పుడు తప్పులను సరిదిద్దారని, త్వరలోనే ఆ ఆస్తి డీడ్ కూడా తన చేతికి వస్తుందని ఆయన ఆకాంక్షించారు.
- ‘‘దావూద్ ఇబ్రహీం చిన్ననాటి బంగ్లా కొనుగోలు కోసం నేను 2020లోనే బిడ్ వేశాను. నేను సనాతన్ ధర్మ్ పాఠశాల పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటుచేశాను. ఆ భవనం నాకు అందగానే ముంబకే గ్రామంలోని దావూద్ చిన్ననాటి ఇంట్లోనూ సనాతన ధర్మ పాఠశాలను ప్రారంభిస్తాను’’ అని అజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
- మొత్తం మీద దావూద్ ఇబ్రహీంకు చెందిన నాలుగు ఆస్తుల వేలం జనవరి 5న ముగిసింది. రెండు పెద్ద ల్యాండ్ పార్సిల్స్‌కు బిడ్‌లు రాలేదు. 1,730 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగిన ప్లాట్‌కు రూ. 1.56 లక్షల రిజర్వ్ ధర ఉండగా.. రూ.3.28 లక్షలకు విక్రయించారు. 170.98 చదరపు మీటర్ల విస్తీర్ణంతో రూ. 15,440 రిజర్వ్ ధర కలిగిన అతి చిన్న ప్లాట్‌ను అజయ్ శ్రీవాస్తవ రూ. 2.01 కోట్లకు కొన్నారు.