Site icon HashtagU Telugu

Indian Armed Forces: భారత త్రివిధ దళాల బలమెంత? పాక్ కంటే ఎక్కువా.. త‌క్కువా?

Indian Armed Forces

Indian Armed Forces

Indian Armed Forces: భారత త్రివిధ దళాల బలం (Indian Armed Forces) ‘గ్లోబల్ ఫైర్ పవర్’ 2025 మిలటరీ ర్యాంకింగ్‌ల ప్రకారం పాకిస్తాన్‌ కంటే గణనీయంగా ముందుంది. 145 దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. భారత సైన్యం సమగ్ర బలం, ఆధునిక ఆయుధాలు, వ్యూహాత్మక సామర్థ్యం దాని ఆధిపత్యాన్ని చాటుతున్నాయి.

భారత సైన్యం సుమారు 22 లక్షల మంది సైనికులతో అత్యంత శక్తివంతమైన దళంగా నిలుస్తుంది. దీనికి 4,201 యుద్ధ ట్యాంకులు, 1,50,000 ఆర్మర్డ్ వాహనాలు, 100 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ, 264 మల్టీ-బారెల్ రాకెట్ ఆర్టిలరీ ఉన్నాయి. ఈ ఆయుధ సంపత్తి సరిహద్దు రక్షణ, ఆక్రమణ సామర్థ్యాలను బలపరుస్తుంది.

Also Read: Masood Azhar: ‘ఆపరేషన్ సిందూర్‌’తో వణికిపోయిన మసూద్ అజార్ ఎవరు ?

భారత వాయు సేనలో 3,10,000 మంది సిబ్బంది ఉన్నారు. 2,229 విమానాలతో బలమైన వైమానిక శక్తిని కలిగి ఉంది. ఇందులో 513 ఫైటర్ విమానాలు, 270 రవాణా విమానాలు, 130 అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 351 శిక్షణ విమానాలు, 6 ట్యాంకర్ ఫ్లీట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. అదనంగా 899 హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో 80 అటాక్ హెలికాప్టర్లు, ఇవి శత్రు లక్ష్యాలను ఖచ్చితంగా ధ్వంసం చేయగలవు.

భారత నౌకాదళంలో 1,42,000 మంది సెయిలర్లు ఉన్నారు. 293 నౌకలతో సముద్ర రక్షణలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇందులో 2 విమాన వాహక నౌకలు, 13 డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 18 సబ్‌మెరైన్లు, 18 కర్వెట్టీలు ఉన్నాయి. ఈ నౌకలు సముద్ర సరిహద్దులను సమర్థవంతంగా రక్షిస్తాయి.

భారత సైన్యం 311 ఎయిర్‌పోర్టులు, 56 పోర్టులను నిర్వహిస్తుంది. ఇవి లాజిస్టిక్స్, వ్యూహాత్మక కదలికలకు కీలకం. ఈ సదుపాయాలు దేశవ్యాప్తంగా సైనిక కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ బలంతో భారత త్రివిధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ వంటి సంక్లిష్ట కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించగలవు. 22 ఏప్రిల్ 2025న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్- పాకిస్తాన్ PoKలోని 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన వైమానిక దాడులు చేసింది. ఈ ఆపరేషన్ మూడు దళాల సమన్వయాన్ని, భారత్ సైనిక శక్తిని స్పష్టంగా చాటింది. ఇది 1971 యుద్ధం తర్వాత మొదటి పెద్ద ఉమ్మడి కార్యాచరణగా నిలిచింది.