సముద్ర తీరాలలో లేదా సముద్రంలో అప్పుడప్పుడు మత్స్యకారులకు కొన్ని వింత జీవులు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని వింత జీవులు సముద్ర కెరటాలకు కొట్టుకొని వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని చూడటానికి వింతగా మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే అలా సముద్రతీరంలో వలకు చిక్కినవి కానీ లేదంటే సముద్ర కెరటాలకు కొట్టుకొచ్చిన భయంకర జీవులను చూస్తే భయపడుతూ ఉంటారు. కొంత మంది అటువంటి జీవులను ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు. తాజాగా ఇలాంటి జీవి ఒకటి యూరప్ లోని వేల్స్‌లో డైఫ్రిన్ ఆర్డుడ్వీ దగ్గర బెన్నార్ బీచ్‌లో ఓ విచిత్రమైన జీవి కనిపించింది.
షెల్ లాంగ్‌మోర్ అనే వ్యక్తి తీరానికి కొట్టుకొచ్చిన ఆ జీవిని చూసి షాక్ అయ్యాడు. ఆ వ్యక్తి ఆ జీవి ఏంటో తెలియక వెంటనే ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేస్తూ ‘చాలా భయంకరంగా ఉంది.. అలాగే అందంగా ఉంది ఇది ఏంటో ఎవరికైనా తెలిస్తే చెప్పండి’ అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కొంతమంది వామ్మో ఏంటిది ఇలా ఉంది అని కామెంట్స్ చేయగా ఇంకొంత మంది మాత్రమే దాన్ని ముట్టుకోకండి విషపూరితమైనది కావచ్చు అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. అయితే ఈ ఫోటో కొద్ది క్షణాల్లోనే వైరల్ అవడంతో సముద్ర నిపుణులు దాన్ని చూసి అవి బాతుమెడ బర్నాకిల్స్ అని తెలిపారు.
When did Demogorgon’s start showing up on beaches in North Wales #Strangerthings4 https://t.co/499aSw4Oy5
— Metro (@MetroUK) June 25, 2022
ఇవి చూడటానికి అచ్చం బాతు మెడ లాగే ఉంటాయని, ఇవి సముద్రంలో రాళ్లకు అతుక్కొని జీవిస్తూ ఉంటాయి అని తెలిపారు. అయితే ఈ జీవి చూడటానికి చాలా భయంకరంగా ఉన్నప్పటికీ చాలా రుచికరమైన సముద్ర ఆహారం అట. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సముద్రపు ఆహారాల్లో ఇది కూడా ఒకటి అని తెలిపారు సముద్ర నిపుణులు. కాగా పోర్చుగల్, స్పెయిన్ లో వీటితో పెర్సెబ్స్ అనే వంటకం కూడా చేస్తారట. అక్కడి ప్రజలకు ఈ రెసిపీ అంటే విపరీతమైన ఇష్టం అని, అవి ఖరీదు ఎక్కువైనా లొట్టలేసుకొని తింటారట. స్పెయిన్ లోని కోస్టా డా మోర్టే ప్రాంతంలోని సముద్రం లోపల రాళ్లకు అతుక్కొని ఉండే ఈ బాతు మెడలను సేకరిస్తారు. వాటిని అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందుకు కేజీ రూ. 28 వేలు ధర పలుకుతోంది. వీటికి ఇంత ధర ఎందుకు అంటే ఇవి ఉండే ప్రదేశాలు మనుషులు ఈదేందుకు అనుకూలంగా ఉండవట. అలాంటి చోటికి నిపుణులైన జాలర్లు వెళ్తారు. వారు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి వీటిని సేకరిస్తున్నారు. బలమైన క్రాషింగ్ అలలను తట్టుకొని వారు వాటిని తీసుకొస్తున్నారు. అందుకే వాటికి అంత ధర ఉంటోంది. ఇలా సముద్రాల్లో మనకు తెలియని వింత జీవులు చాలా ఉన్నాయి.