Site icon HashtagU Telugu

Chandrayaan 3 Explained : చంద్రయాన్ 3.. చంద్రుడి దక్షిణ ధృవంపై ఏం జరగబోతోంది ?

Chandrayaan-3

Chandrayaan 3 Explained

Chandrayaan 3 Explained : చంద్రయాన్ 3 యాత్ర జూలైలో జరుగనుంది. ఈవిషయాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించిన  నేపథ్యంలో దానిపై డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే మనదేశం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 నిర్వహించింది. ఇప్పుడు చంద్రయాన్ 3 నిర్వహించేందుకు ఇండియా రెడీ అవుతోంది. ఇంతకీ చంద్రయాన్ 3 ఏమిటి ? ఇందులో ఇస్రో పెట్టుకున్న లక్ష్యాలు ఏమిటి ? ఎటువంటి ఫ్యూచర్ ప్లాన్ తో ఈ చంద్ర యాత్రను చేస్తున్నారు ? ఇప్పుడు తెలుసుకుందాం..

చంద్రయాన్ 3 (Chandrayaan 3 Explained) అనేది చంద్రయాన్ 2కు కొనసాగింపు. అందుకే మనం ముందుగా  చంద్రయాన్ 2 గురించి తెలుసుకోవాలి. 2019లో జరిగిన చంద్రయాన్ 2 యాత్ర చివరి దశలో విఫలమైంది. దాన్ని 2019 సెప్టెంబర్ 6వ తేదీన సక్సెస్ ఫుల్ గా చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టినా సాఫ్ట్‌వేర్ లోపం తలెత్తింది. దీంతో చంద్రునిపై ల్యాండర్ “విక్రమ్”   ల్యాండ్ అయ్యే క్రమంలో కక్ష్య నుంచి వైదొలగి.. అది చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో ల్యాండర్ లోపల ఉన్న రోవర్ “ప్రజ్ఞాన్” బయటికి వెళ్లే ఛాన్స్ దొరకలేదు. అయితే చంద్రయాన్ 2  ఆర్బిటార్ మాత్రం ఇంకా పనిచేస్తోంది.

చంద్రయాన్ 3లో ఏం చేస్తారు ?

చంద్రయాన్ 3లో కూడా ఇదే విధంగా ల్యాండర్, రోవర్ రెండూ ఉంటాయి.ఈసారి ఎలాగైనా ల్యాండర్ ను సేఫ్ గా ల్యాండింగ్ చేయించాలనే పట్టుదలతో ఇస్రో ఉంది. తద్వారా చంద్రయాన్ 2లో ఎదురైన ఫెయిల్యూర్ ను .. ఇప్పుడు సక్సెస్ గా మార్చుకునే  పనిలో నిమగ్నమైంది. ప్రత్యేకించి చంద్రయాన్ 3 ముఖ్య టార్గెట్..  చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతం. ఈసారి చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ను దింపుతారు. అక్కడ ల్యాండర్  దిగగానే.. దాని లోపలి నుంచి రోవర్ బయటికి వెళ్తుంది. అది చంద్రుడి గడ్డపై చక్కర్లు కొడుతూ.. ఎన్నో విషయాలను , సమాచారాన్ని సేకరిస్తుంది. చంద్రుడి నేల స్వభావం, అందులోని ఖనిజ నిల్వలు,  చంద్రుడిపై వాతావరణ స్థితిగతులు వంటి అన్ని వివరాలను సేకరించి ఇస్రో కేంద్ర కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పంపుతుంది. రోవర్ లో అత్యాధునిక కెమెరాలు కూడా ఉన్నాయి. వాటితో అది చంద్రుడి ఉపరితలం, పరిసరాల ఫోటోలను తీసి ఇస్రోకు పంపుతుంది. ఇక్కడి ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చంద్రయాన్ 3  రోవర్ కదలికలు ఉంటాయి.

Also read : Bullet Train To Space: చంద్రుడు, అంగారకుడిపైకి బుల్లెట్ ట్రైన్.. జపాన్ యోచన!!

చంద్రుని దక్షిణ ధృవమే ఎందుకు ?

చంద్రయాన్ 3ను చంద్రుని దక్షిణ ధృవంపై ల్యాండ్ చేసేందుకు సర్వం సిద్ధమౌతోంది. ఇంతకీ చంద్రుని దక్షిణ ధృవంపైనే ఇస్రో ఎందుకు ఫోకస్ చేసిందంటే.. అక్కడ నీటి జాడలు ఉన్నాయి. ఆ ప్రాంతంలోని చంద్రగర్భంలో మంచు స్ఫటికాల రూపంలో నీటి నిల్వలు ఉన్నాయని తాజాగా నాసా కూడా గుర్తించింది. చంద్రుని దక్షిణ ధృవంపై గురుత్వాకర్షణ శక్తి కూడా చాలా తక్కువ.  పైగా అక్కడ వెలుతురూ లేదు.  ఎన్నో వేల సంవత్సరాలుగా అక్కడ వెలుగు లేకపోవడంతో.. ఉష్ణోగ్రత మైనస్ 248 డిగ్రీలుగా ఉంది. అంతటి తీవ్రమైన చలి ఉంటుంది.  కాబట్టి నీరు ఉండే అవకాశం ఉంది. అక్కడ  ఘనీభవించిన మంచు రూపంలో నీరు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  ఇస్రో అంచనా ప్రకారం.. అక్కడ  పదికోట్ల టన్నుల మేర నీరు ఉండొచ్చు. నీరు ఉన్నచోట మనిషి ఉండగలడు. భవిష్యత్ లో చంద్రుడిపై ఇస్రో రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు మంచి అడ్డాగా ..  దక్షిణ ధృవం మారొచ్చు.  అక్కడ రాళ్లు, శిలలు తక్కువగా ఉంటాయి.  ల్యాండర్ దిగడానికి అనుకూలంగా కూడా ఉంటుంది. అంతేకాదు, అక్కడ సిల్వర్ తో పాటు ఇతర మూలకాలు ఎక్కువగా ఉన్నాయి.

గతంలో అక్కడ అమెరికా ఫెయిల్ .. 

గతంలో అమెరికా వంటి దేశాలు చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టాలని అనుకున్నా కుదర్లేదు.  అమెరికా ప్రయోగించిన ఓ ఉపగ్రహం చంద్రుని దక్షిణ దృవంపై 100 కిలోమీటర్ల దూరంలో ఉండగానే కూలిపోయింది.  చివరి వరకు వచ్చి 2.1 కిలోమీటర్ల వరకు వెళ్లిన మొదటి ఉపగ్రహం మన చంద్రయాన్ 2.  ఒకవేళ చంద్రయాన్ 2 అనుకున్నట్టుగా దిగి, సంకేతాలను పంపి ఉంటే .. అక్కడి అసలు విషయాలు ఏంటి అన్నది ఇప్పటికే  బయటకు వచ్చి ఉండేవి. ఇండియా ప్రయోగించిన చంద్రయాన్ 2 స్పూర్తితో 2024 లో అమెరికా ఆర్టెమిస్ అనే వ్యోమనౌకను చంద్రుని దక్షిణ ధృవం మీదకు పంపాలని చూస్తోంది. యూరప్ స్పేస్ ఏజెన్సీ కూడా అదే విధంగా చంద్రుడి దక్షిణ ధృవంపైకి  రోవర్ ను పంపించాలని యోచిస్తోంది.