Site icon HashtagU Telugu

Ceasefire: సీజ్‌ఫైర్ అంటే ఏమిటి? ష‌ర‌తులు ఏమైనా ఉంటాయా!

Pakistan-India Ceasefire

Pakistan-India Ceasefire

Ceasefire: భారత్- పాకిస్తాన్ మరోసారి యుద్ధం అంచున నిలిచాయి. కానీ చివరి క్షణంలో ఏదో జరిగి పరిస్థితులు మారిపోయాయి. రెండు దేశాల మధ్య సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొని తూటాలు పేలుతూ, దాడులు జరుగుతూ, ప్రజలు భయం గుండెల్లో జీవిస్తున్నారు. అయితే అమెరికా నుంచి వచ్చిన ఒక పెద్ద వార్త అందరికీ ఊరట కలిగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్- పాకిస్తాన్ తక్షణ, పూర్తి ఆయుధ విరమణ (Ceasefire)కు అంగీకరించాయని ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వం 48 గంటల దౌత్యపరమైన చర్చల ద్వారా ఇది సాధ్యమైంది. రెండు దేశాలు యుద్ధం లేదా ఘర్షణను ఆపడానికి అంగీకరించినప్పుడు దానిని సీజ్‌ఫైర్ అంటారు. సీజ్‌ఫైర్ అంటే ఏమిటి? దాని షరతులు ఏమిటో తెలుసుకుందాం.

ట్రంప్ సీజ్‌ఫైర్ ప్రకటన

భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ ఒక పెద్ద ఊరట కలిగించే వార్త వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేస్తూ.. రెండు దేశాలు పూర్తి, తక్షణ ఆయుధ విరమణ (సీజ్‌ఫైర్)కు అంగీకరించాయని తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. గత కొన్ని రోజులుగా భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు, దాడులు జరుగుతూ యుద్ధ భయం నెలకొన్నాయి. అయితే ఇప్పుడు రెండు దేశాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించాయి.

అమెరికా చొరవతో రెండు దేశాల నాయకులతో చర్చలు

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సీజ్‌ఫైర్ వెనుక గత 48 గంటల్లో తీవ్రమైన దౌత్యపరమైన చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్, విదేశాంగ మంత్రి రుబియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, సైన్యాధిపతులతో చర్చలు జరిపారు. అదే విధంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, భద్రతా సలహాదారు ఆసిమ్ మాలిక్‌లతో కూడా సంప్రదింపులు జరిగాయి. ఈ చర్చల తర్వాత రెండు దేశాలు కేవలం యుద్ధాన్ని ఆపడానికే కాకుండా శాంతియుత ప్రదేశంలో కూర్చుని సంప్రదింపులు జరపడానికి కూడా సిద్ధమయ్యాయి.

Also Read: Bomb Threats: ఇండోర్‌లోని క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు!

సీజ్‌ఫైర్ అంటే ఏమిటి, ఎందుకు ముఖ్యం?

సీజ్‌ఫైర్ అంటే ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. సీజ్‌ఫైర్ లేదా ఆయుధ విరమణ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధ పక్షాలు యుద్ధం లేదా ఘర్షణను ఆపడానికి అంగీకరించడం. ఈ ఒప్పందం తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఇది అధికారిక సంధిగా ప్రకటించబడుతుంది. మరికొన్నిసార్లు ఇది పరస్పర అవగాహన లేదా మధ్యవర్తిత్వం (ఈ సందర్భంలో అమెరికా) ద్వారా జరుగుతుంది. దీని ఉద్దేశం హింసను ఆపడం, మానవతా సహాయం చేరవేయడం లేదా శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరపడం.

సీజ్‌ఫైర్‌ను స్థిరంగా ఉంచడానికి షరతులు ఏమిటి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సీజ్‌ఫైర్ అప్పుడే స్థిరంగా ఉంటుంది. రెండు పక్షాలకు యుద్ధం వల్ల భారీ నష్టం జరుగుతున్నప్పుడు, విశ్వసనీయ ఒప్పందం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు. దీనికి నిఘా, సైన్యం ఉపసంహరణ,, మూడవ పక్షం హామీ వంటి ఏర్పాట్లు అవసరం. కొన్ని సందర్భాల్లో కొన్ని దేశాలు సీజ్‌ఫైర్‌ను తమ సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించడానికి లేదా వ్యూహాత్మక ప్రయోజనం పొందడానికి ఉపయోగిస్తాయి. దీనివల్ల ఒప్పందం త్వరగా భగ్నమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్- పాకిస్తాన్ మధ్య ఈ అంగీకారం ప్రపంచవ్యాప్తంగా ఊరట కలిగించే విషయం. ఈ సీజ్‌ఫైర్ భవిష్యత్తులో శాశ్వత శాంతిగా మారుతుందని ఆశిస్తున్నారు.

Exit mobile version