Site icon HashtagU Telugu

Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

Nithyananda Swamy

Nithyananda Swamy

నిత్యానంద మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎక్కడో ఈక్విడార్ దీవుల్లో సెటిల్ అయిన ఈ సెల్ఫ్ మేడ్ గాడ్.. రోజుకో ఫీలర్స్ వదులుతున్నాడు. చనిపోయాడని ఎవరూ ప్రచారం చేయకపోయినా.. తాను చనిపోలేదని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే, తానింకా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి అనే సంకేతం ఇచ్చారు. కాకపోతే, నిత్యానందను నిజంగానే ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నట్టున్నాయి. తినబుద్ది కావడం లేదు, తిన్నది అరగడం లేదు అంటే పెద్ద సమస్యే.
పోనీ, ఒంట్లో ఏమైనా అయిందా అంటే అన్ని అవయవాలూ బాగానే పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. తాను ప్రతిరోజూ నిత్య పూజలు మాత్రమే చేసి, ఆ తరువాత నిర్వికల్ప సమాధిలోకి వెళ్లి వస్తున్నానని ఓ ప్రకటన ఇచ్చారు.
దీంతో అసలు నిర్వికల్ప సమాధి అంటే ఏంటనే సందేహాలు పుట్టుకొచ్చాయి. నిజానికి నిత్యానంద వాడిన నిర్వికల్ప సమాధి అనే పేరుకి పెద్ద అర్ధమే ఉంది. నిజంగా అలాంటి సమాధిలోకి వెళ్లి ఉంటే గనక అసలు శరీరంపై ప్రేమ, మమకారం అన్నదే ఉండకూదు. కాని, విచిత్రంగా తిన్నది అరగట్లేదు అంటూ చెప్పుకొచ్చారు.

నిర్వికల్ప సమాధిలోకి వెళ్లిన వాళ్లు తన జన్మపరంపర గురించి, కర్మ పరంపర గురించి తెలుసుకోగలరు. శరీరంపై గాని, జీవితంపై గాని ఎలాంటి సంశయాలూ ఉండని స్థితి అది. అంత:జ్ఞానం పూర్తిగా తెరుచుకుని సంపూర్ణ ఉత్తేజితం అయ్యే స్థితి అది. పూర్ణాత్మ గురించి కూడా మొత్తం తెలిసిపోతుంది. ఒకవిధంగా ఈ సమాధి స్థితిలోనే కర్తవ్య నిష్ట బోధపడుతుంది. ఇలా మనస్సు నిర్వికల్ప సమాధిలోకి వెళ్లినప్పుడే తోటివారికి గాని, తన భక్తులకు గానీ సత్యమార్గం చూపించగలం. కాని, ఇవేవీ కాకుండా.. తిన్నది అరగడం లేదనడం ఎంత వరకు కరెక్టో నిత్యానందకే తెలియాలి. అంటే నిత్యానందకు ఇంకా శరీరం మీద మోహం, మమకారం పోలేదన్న మాట.