ICC Three Rules : జూన్ 1 విడుదల ..ఐసీసీ 3 రూల్స్‌ లో మార్పు

సాఫ్ట్ సిగ్నల్‌.. ఫ్రీ హిట్ బౌల్డ్..హెల్మెట్..ఈ మూడు అంశాలకు సంబంధించిన రూల్స్ (ICC Three Rules)ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా సవరించింది.

  • Written By:
  • Updated On - May 16, 2023 / 11:53 AM IST

సాఫ్ట్ సిగ్నల్‌..

ఫ్రీ హిట్ బౌల్డ్..

హెల్మెట్..

ఈ మూడు అంశాలకు సంబంధించిన రూల్స్ (ICC Three Rules)ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా సవరించింది. తరుచూ మ్యాచ్ లలో వీటికి సంబంధించిన వివాదాలు తలెత్తుతుండటంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి ఇంగ్లాండ్, ఐర్లాండ్ టీమ్స్ మధ్య ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ నుంచి ఈ కొత్త రూల్స్(ICC Three Rules) అమలులోకి వస్తాయి. జూన్ 7 నుంచి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ లో కూడా ఈ రూల్స్ అమలు చేస్తారు. ఈనేపథ్యంలో ఆ నిబంధనల గురించి కొన్ని వివరాలివీ..

* సాఫ్ట్ సిగ్నల్

బౌండరీ లైన్ కు దగ్గరో లేదా బాల్ నేలను తాకినట్టు పట్టిన క్యాచ్‌ల విషయంలో తీసుకునే నిర్ణయాన్ని సాఫ్ట్ సిగ్నల్ అంటారు. తొలుత ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినా, దాన్ని మళ్లీ టీవీ (థర్డ్‌) అంపైర్‌కు నివేదిస్తారు. అప్పుడు నాటౌట్ అని తేలినా.. సాఫ్ట్ సిగ్నల్ ప్రకారం అవుటనే ప్రకటిస్తారు. ఇప్పుడు ఆ రూల్‌ కు ఐసీసీ తీసేసింది. ఇకపై టీవీ అంపైర్ తీసుకునే నిర్ణయాన్నే లెక్కలోకి తీసుకుంటారు.

ALSO READ : India vs Pakistan: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

* ఫ్రీ హిట్ బౌల్డ్

ఇప్పటివరకూ ఫ్రీ హిట్‌కు బౌల్డ్ అయితే రన్స్ తీయడానికి వీలు ఉండేది కాదు. ఒకవేళ బంతి బౌండరీ లైన్‌వైపు వెళ్లినా.. దాన్ని లెక్కలోకి తీసుకునే వారు కాదు. దాంతో ఫ్రీ హిట్ వృధా అయ్యేది. ఇప్పుడు ఆ రూల్‌ని ఐసీసీ తీసేసింది. ఫ్రీ హిట్‌కు బౌల్డ్ అయినా సరే, ఇకపై రన్స్ తీసుకోవచ్చు. అంతేకాదు ఈ రన్స్ ఎక్స్‌ట్రాస్ కోటాలోకి వెళ్లవు. నేరుగా బ్యాట్స్ మన్ ఖాతాలోకే వెళ్తాయి. ఒకరకంగా ఇది బ్యాట్స్ మన్ కు బంపర్ ఆఫర్.

* హెల్మెట్

ఇప్పటివరకు పేసర్లు బౌలింగ్ వేస్తున్నప్పుడు కొందరు బ్యాటర్లు హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేసేవాళ్ళు. ఇకపై ఆ వీలు ఉండదు. కొత్త రూల్ ప్రకారం.. బ్యాటర్లకు చేరువగా ఫీల్డింగ్ చేసే ఫీల్డర్లు, కీపర్ సైతం తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాల్సి ఉంటుంది.