Site icon HashtagU Telugu

Weekend Marriage: సోలో లైఫ్ వద్దు.. వీకెండ్ మ్యారేజ్స్ ముద్దు!

Wekend Marriage

Wekend Marriage

కాలాలు మారుతున్నాయి. కాలంతో పాటు యువత (Youth) ఆలోచనలు మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ రూల్స్ అయినా బ్రేక్ చేయడానికి ముందుంటున్నారు. ఇప్పటికే గర్ల్ ఫ్రెండ్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, లివింగ్ రిలేషన్ లాంటివి కొత్త కొత్త కల్చర్ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ‘వీకెండ్ మ్యారేజ్’ (Weekend Marriage) అనే కాన్సెప్ట్ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ఈ తరం యూత్ పాత తరం విలువలకు గుడ్ బై చెబుతూ కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు.

ఒకప్పుడు జపాన్ లో మాత్రమే వినిపించిన వీకెండ్స్ మ్యారేజ్.. ప్రస్తుతం ఇండియాలోనూ వినిపిస్తోంది. వారాంతపు వివాహం  అంటే.. ఒక జంట వీకెండ్స్ లో ఏదైనా అపార్ట్ మెంట్స్ లో భార్యాభర్తలుగా (Couple) కలిసి ఉండటం. అయితే ఈ ఏర్పాటు వెనుక అనేక కారణాలున్నాయి. ఒకరు లేదా ఇద్దరు భాగస్వాములు వేర్వేరు నగరాలు లేదా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చినప్పుడు వీకెండ్స్ మ్యారేజ్ ను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఈ జీవన విధానం ఖచ్చితంగా దాని సవాళ్లతో కూడుకున్నది. కేవలం యూత్ మాత్రమే కాకుండా పెళ్లి చేసుకోబోయే జంటలు కూడా వీకెండ్స్ మ్యారేజ్ (Weekend Marriage) పేరుతో ట్రయల్స్ వేస్తున్నాయి. అయితే దీని వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

మరొక వ్యక్తితో సన్నిహితంగా జీవించడం ఎల్లప్పుడూ కొన్ని విభేదాలకు దారి తీస్తుంది. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం సర్వసాధారణం. అయితే, ఈ పరిస్థితులను నివారించడానికి ఈ వివాహం మీకు సహాయపడుతుంది. మీరు కలిసి గడిపే తక్కువ సమయం, వాదనలు, విభేదాలకు తక్కువ సమయం ఉంటుంది. వారాంతాల్లో మాత్రమే ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అది కలిసి గడిపిన సమయాన్ని మరింత సానుకూలంగా మరియు గుర్తుండిపోయేలా చేస్తుంది. అయితే చాలామంది జంటలు శారీరక వ్యామోహంతో సెక్సువల్ లైఫ్ కు ఆసక్తి చూపుతున్నారు. అయితే వీకెండ్స్ మ్యారేజ్ (Weekend Marriage) తర్వాత ఇద్దరి మధ్య ఏదైనా ఇష్యూ జరిగితే ప్రైవేట్ ఫొటోలు బయట పడే అవకాశం ఉంది. అయితే వీకెండ్స్ మ్యారేజ్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అంతే ఉన్నాయి.

ఆసక్తి చూపేది ఎవరంటే

సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్

ఇతర చోట్లా విధులు నిర్వహించే ఉద్యోగులు

పెళ్లి చేసుకోబోయే జంటలు

దేశంలో ఎక్కడ

బెంగళూరు

పుణే

ముంబై

ఢిల్లీ

Also Read: Kangana Ranaut: గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన కంగనా రనౌత్!