farmers protest: మళ్లీ రైతులు ఆందోళలనకు సిద్ధమవుతున్నారు. హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు వద్ద హర్యానా ప్రభత్వం రోడ్ బ్లాక్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. దీంతో వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్‌మంతర్‌లో గానీ, రామ్‌లీలా మైదానంలో గానీ శాంతియుత నిరసనకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు చెబుతున్నారు. ఈసారి తమను అడ్డుకున్నా, రహదారిపై బారికేడ్లు ఏర్పాటుచేసినా.. హరియాణా ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీకేయూ స్పష్టం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, గత కొన్ని రోజులుగా రైతులు పంటలకు కనీస మద్దతు ధర కల్పిచడంతోపాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ఉద్యమంలో భాగంగా ఫిబ్రవరిలో రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. అప్పటినుంచి హరియాణా సరిహద్దులోనే శిబిరాలను ఏర్పాటుచేసుకొని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఘర్షణల నేపథ్యంలో శింబు సరిహద్దు వద్ద అధికారులు రోడ్డును మూసివేసి, రాకపోకలు నిలిపివేశారు. దీనిపై విచారణ చేపట్టిన పంజాబ్- హరియాణా హైకోర్టు.. ప్రయాణికుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని రహదారిపై ఏర్పాటుచేసిన అడ్డంకుల్ని తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హరియాణా ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. జాతీయ రహదారుల్ని దిగ్బంధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదంటూ.. అడ్డంకుల్ని తొలగించాలని నాలుగు రోజుల క్రితం తీర్పునిచ్చింది. ఈనేపథ్యంలో రోడ్డుపై అడ్డంకుల్ని తొలగించడం అనివార్యమైంది.
Read Also: Ram Double Ismart : హనుమాన్ నిర్మాతల చేతుల్లోకి డబుల్ ఇస్మార్ట్.. భారీ డీల్..!
ఈ నేపథ్యంలోనే మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మరోవైపు మార్చిలో ఆందోళనలు నిర్వహించిన సమయంలో అరెస్టయిన నవ్‌దీప్‌సింగ్‌కు సంఘీభావంగా బుధ, గురువారం అంబాలాలో శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది. ఫిబ్రవరిలో రైతులు, భద్రతా బలగాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే యువ రైతు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక వేళ రైతులు మళ్లీ ‘చలో ఢిల్లీ’కి పిలుపునిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: Doda encounter: దోడా ఎన్‌కౌంటర్ పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ యాక్షన్ ప్లాన్