Site icon HashtagU Telugu

Rahul: వయనాడ్‌ ఘటన.. బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయండి: రాహుల్‌

Wayanad incident.. Release immediate compensation to victims: Rahul

Wayanad incident.. Release immediate compensation to victims: Rahul

Wayanad Landslides : కేరళలోని వయనాడ్‌ లో కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై లోక్‌సభలో మంగళవారం నాడు వయనాడ్ మాజీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ..వయనాడ్‌లో భారీగా ప్రాణనష్టం జరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరారు. ప్రకృతి వైపరీత్యంలో బాధితులకు తక్షణ పరిహారం విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. తరచు ప్రకృతి వైపరీత్యాలకు అతలాకుతలమయ్యే ప్రాంతాల పరిరక్షణకు కార్యాచరణ పథకాన్ని తక్షణం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు ఉదయం కొండచరియలు విరిగిపడటంతో వయనాడ్ అతలాకుతలమైంది. 45 మందికి పైగా ప్రాణాలు కోల్పాయారు. ముండక్కై ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. భారీగా జరిగిన ప్రాణనష్టం, ఆస్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది” అని రాహుల్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో తాను మట్లాడినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం సహాయక చర్యలు, మెడికల్ కేర్‌తో పాటు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలని, అవసరమైతే పరిహారం పెంచాలని కోరారు. కీలకమైన కమ్యూనికేషన్, రవాణా లైన్స్‌ను పునరుద్ధరించాలని, సాధ్యమైనంత త్వరగా ఉపశమనం కలిగించాలని, బాధిత కుటుంబాల పునరావాసానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు.

కాగా, దేశంలో కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలపై రాహుల్ ఆందోళన వ్యక్తం చేస్తూ, వయనాడ్, వెస్ట్రన్ ఘాట్స్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియల ముప్పుపై పలు సార్లు తాను మాట్లాడానని, గత కొన్నేళ్లుగా దేశంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు బాగా పెరిగాయని అన్నారు. ల్యాండ్‌స్లైడ్ ముప్పు ఉన్న ప్రాంతాలను గుర్తించి, ముప్పు నివారించే చర్యలు చేపట్టాలని, పర్యవారణపరంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తరచు జాతీయ విపత్తుల తీవ్రతను గుర్తించి వాటి నివారణకు తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

Read Also: IND vs SL 3rd T20: మూడో టీ20 జరగడం కష్టమే: వెదర్ రిపోర్ట్