Waterpark Tragedy-Father Killed : ఆ తండ్రి తన మూడేళ్ళ కూతురితో కలిసి వాటర్ పార్క్ కు వెళ్ళాడు..
అక్కడున్న అన్ని గేమ్స్ ను ఒకదాని తర్వాత ఒకటిగా ఆడుతూ.. వాళ్ళు బౌన్సి క్యాజిల్ (bouncy castle) దగ్గరికి వచ్చారు..
బౌన్సి క్యాజిల్ లో ఆ తండ్రి, కూతురు కూర్చున్నాక ఊహించని ప్రమాదం జరిగింది.
60 అడుగుల హైట్ ఉన్న ఆ బౌన్సి క్యాజిల్.. బలమైన గాలులు వీయడంతో ఒక్కసారిగా 150 అడుగుల ఎత్తుకు ఎగిరింది.
ఏం జరుగుతోందో వాళ్లకు అర్ధం కాలేదు..
దీంతో అందులో కూర్చున్న తండ్రి, కూతురు 150 అడుగుల ఎత్తు నుంచి నీటి కొలనులోకి పడిపోయారు.
పాప తండ్రి (35) తీవ్ర గాయాలపాలై చనిపోయాడు. ఆ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
Also read : Harley-Davidson: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా రెండు బైక్‌లు.. ధర ఎంతంటే..?
ఫ్రాన్స్‌లోని సెయింట్ మాక్సిమిన్ లా సెయింట్ బౌమ్ ఏరియాలో ఉన్న వండర్‌ల్యాండ్ వాటర్‌పార్క్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటన కారణంగా.. వినోదం కోసం వాటర్ పార్క్ కు వచ్చిన కుటుంబానికి విషాదం మిగిలింది. వాస్తవానికి వండర్‌ల్యాండ్ ను చాలా రిపేర్ వర్క్స్ తర్వాత ఇటీవలే రీ ఓపెన్ చేశారు. బౌన్సి క్యాజిల్ (Waterpark Tragedy-Father Killed )అనేది నీటి కొలనులో బుడగలా తేలియాడే నిర్మాణం. అందులో పిల్లలు సరదాగా కూర్చొని షిప్ జర్నీ చేసిన ఫీలింగ్ ను ఆస్వాదిస్తుంటారు. ఇలా నీటిపై తేలియాడుతున్న బౌన్సి క్యాజిల్ అకస్మాత్తుగా వీచిన ఈదురు గాలుల ధాటికి గాల్లోకి ఎగిరి.. అందులో ఉన్న ఇద్దరిని 150 అడుగుల ఎత్తు నుంచి నీటిలో పడేసింది.
Also read : Crane Collapse-17 Died : 200 అడుగుల ఎత్తు నుంచి కూలిన క్రేన్.. 17 మంది కార్మికుల మృతి