Site icon HashtagU Telugu

Russia Ukraine : న‌ల్ల సముద్రంలో ర‌ష్యాపై ఉక్రెయిన్ ఆధిప‌త్యం

Russia Moskwa

Russia Moskwa

న‌ల్ల స‌ముద్రంలో ర‌ష్యా ద‌ళాల‌కు ఉక్రెయిన్ సైన్యం చుక్క‌లు చూపెట్టింది. ర‌ష్యా పెట్రోలింగ్ బోట్ ల‌ను ఉక్రెయిన్ సైనికులు పేల్చేశారు. ఆ మేర‌కు ఉక్రెయిన్ సైనిక ద‌ళం ప్ర‌క‌టించింది. మాస్కో డిమాండ్‌ను స‌వాల్ చేస్తూ ఉక్రేనియన్ సైనికులు నల్ల సముద్రపు స్నేక్ ఐలాండ్ సమీపంలో ర‌ష్యా డ్రోన్‌లను కూల్చేసింది. రెండు రష్యన్ పెట్రోలింగ్ బోట్‌లను పేల్చేసిన‌ట్టు వెల్ల‌డించింది.

స్నేక్ ఐలాండ్ సమీపంలో సోమ‌వారం తెల్లవారుజామున రెండు రష్యన్ రాప్టర్ పడవలు ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాకు ఒక‌ ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక చిన్న సైనిక నౌకలో పేలుడు జరిగినట్లు చూపించే గ్రైనీ బ్లాక్ అండ్ వైట్ ఏరియల్ ఫుటేజీని కూడా విడుదల చేసింది. ఆ మేర‌కు ఉక్రేనియన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ వాలెరీ జలుజ్నీ, టర్కీ-నిర్మిత సైనిక డ్రోన్‌లను ప్రస్తావిస్తూ ప్రకటనలో పేర్కొన్నారు.

 

రాప్టర్ పెట్రోలింగ్ బోట్‌లలో ముగ్గురు సిబ్బంది, 20 మంది సిబ్బంది వరకు ప్రయాణించవచ్చు. అవి సాధారణంగా మెషిన్ గన్‌లతో అమర్చబడి ఉంటాయి. నిఘా లేదా ల్యాండింగ్ కార్యకలాపాలలో ఉపయోగించబడతాయి.
రేడియో మార్పిడి వైరల్ అయిన తర్వాత స్నేక్ ఐలాండ్ ఉక్రేనియన్ ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. యుద్ధనౌకను క్షిపణులతో ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ తెలిపింది.