Site icon HashtagU Telugu

Ukraine Song : అందరి మనసులు కలిచివేస్తున్న ఉక్రెయిన్ వాసుల పాట

Ukraine Song

Ukraine Song

రష్యా-ఉక్రెయిన్ వార్ తో ప్రపంచం మొత్తం తలకిందులవుతోంది. ఆర్థికంగా, అన్నిరకాలుగా నష్టపోతోంది. కానీ ఈ సమరం చాలామందిలో భావోద్వేగాలను పెంచుతోంది. పుట్టినూరు, కన్నవాళ్లను కాదని దూరంగా వెళ్లిపోయేలా చేస్తోంది. ఎవరికి ఎవరినీ కాకుండా చేస్తోంది. దీనికి సంబంధించి రచయితలు, కవులు స్పందిస్తున్నారు. పాటలు పాడుతున్నారు. సంగీతం వినిపిస్తున్నారు. కానీ ఇవన్నీ విషాద పవనాలనే వీచేలా చేస్తోంది. ఇంటర్నెట్ లో ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది.

పుట్టి పెరిగిన ఊరు, పరిసరాలు, చుట్టుపక్కnవారితో ఆడుకున్న ప్రాంతాలు, గడిపి మధుర క్షణాలు, కలిసి డిన్నర్ చేసిన ప్రదేశాలు.. అన్నీ తమను విడిచి వెళ్లిపోమని చెబుతున్నాయి. బాధ, దుఃఖం, కోపం, కసి.. అన్ని రకాల భావోద్వేగాలు గుండెను బరువెక్కేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ పరిస్థితి ఇదే. అందమైన ప్రదేశాలన్నీ కళాకాంతులను కోల్పోయాయి. భారీ భవనాలన్నీ మసిబొగ్గయి దర్శనమిస్తున్నాయి. అందమైన దృశ్యం కళ్లముందే చెదిరిపోతోంది. పీడకలగా మిగిలిపోతోంది.

ఈ వీడియో చూస్తున్నవారి గుండె ఆవేదనతో నిండిపోతుంది. కళ్లు చెమర్చుతాయి. ఈ వీడియోలో ఓ యువతి పియానో వాయిస్తూ.. లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ రాసిన పాట.. ‘వాటే వండర్ ఫుల్ వరల్డ్’ ను పాడుతుంది. లివివ్ రైల్వే స్టేషన్ లో నిలబడి ఉన్న వారందరినీ ఆ పాట కదిలించడంతో చాలామంది తమ బ్యాగులను పట్టుకుని ఆమె చుట్టూ నిలబడి ఆమె పాట వింటూ ఉంటారు.

ఉక్రెయిన్ తో రుణం తీరిపోయిందే అన్న వేదనతో, చేయని తప్పునకు తరాలకు తరాలు బాధను అనుభవించాల్సి వస్తుందే అనే ఆవేదనతో బాధపడుతున్నారు ఉక్రెయిన్లు. కన్న కలలు, పెంచుకున్న ఆశలు, పెట్టుకున్న ఆశయాలు అన్నింటికీ ఒక్క యుద్ధంతో సమాధి కట్టినట్టయ్యింది. అందుకే ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.